Begin typing your search above and press return to search.

ప్రకాష్ బ్యాక్:ఆయన దురదృష్టమో.. మన అదృష్టమో..

By:  Tupaki Desk   |   23 Nov 2019 6:05 AM GMT
ప్రకాష్ బ్యాక్:ఆయన దురదృష్టమో.. మన అదృష్టమో..
X
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎంపీగా పోటీచేశారు మన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. బీజేపీ విధానాలను తూర్పారపడుతూ.. మోడీని తీవ్రంగా విమర్శిస్తూ సినిమాల కాడి వదిలేసి రాజకీయం బాటపట్టారు. కానీ బ్యాడ్ లక్.. విమర్శించిన బీజేపీ అభ్యర్థి చేతిలోనే ప్రకాష్ రాజ్ ఓడిపోయారు.

నిజానికి ప్రకాష్ రాజ్ గనుక ఎంపీగా గెలిచిఉంటే ఆయన అభ్యుదయ భావాలతో ఢిల్లీలో బాట పట్టి పార్లమెంట్ లో చేరి రాజకీయ నేతగా ఫైర్ బ్రాండ్ గా వెలిగిపోయేవారు. కానీ ఆయన దురదృష్టమో.. మన అదృష్టమో కానీ ప్రకాష్ రాజ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు.

ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే సీరియస్ పాలిటిక్స్ వైపు అడుగులు వేశారో గత ఆరు నెలల ముందు వరకూ ఆయన ఏ సినిమాలు ఒప్పుకోలేదు. ఇక చాలా మంది దర్శక నిర్మాతలు టర్న్ తీసుకొని పాలిటిక్స్ వైపు వెళ్లిన ప్రకాష్ రాజ్ కు పాత్రలు ఇవ్వలేదు. సినిమాల్లో నటింపచేయలేదు. దీంతో గడిచిన ఏడు ఎనిమిది నెలలుగా ప్రకాష్ రాజ్ లేకుండా దక్షిణాది సినిమాలు నడిచాయి..

నిజానికి ‘సరిలేరు మీకెవ్వరు’ చిత్రంలో విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ స్థానంలో మొదట జగపతిబాబునే ఖాయం చేశాడట అనిల్ రావిపూడి. కానీ ప్రకాష్ రాజ్ పట్టుబట్టి సంప్రదించి తనకు ఈ పాత్ర కావాలని అడిగారని ప్రచారం సాగింది. దీంతో జగపతి బాబు స్థానంలో రాయలసీమ ఫ్యాక్షనిస్టు పాత్రలో ప్రకాష్ రాజ్ వచ్చాడు. నిన్న విడుదలైన టీజర్ లో ఆయన అసలు సిసలు ఫ్యాక్షనిస్టుగా చెప్పిన ఒకే ఒక డైలాగ్ పంచ్ లా పేలింది. ‘సంక్రాంతికి మొగుడొచ్చాడు’ అన్నది ఉర్రూతలూగించింది.

ఇలా ఏది ఏమైతేనే ప్రజలు గెలిపిస్తే ఎంపీ అయిపోయి సినిమాలకు దూరం అయిపోయే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓడిపోయి ఇప్పుడు ఆ రాజకీయాన్ని వదిలి మళ్లీ సినిమాల బాట పట్టడం సగటు అభిమానికి అయితే ఆనందాన్ని ఇచ్చింది.