Begin typing your search above and press return to search.

ఒక్క సినిమాతో రాణీ ల‌క్ష్మీభాయ్ అయిపోతుందా?

By:  Tupaki Desk   |   12 Sep 2020 10:50 AM GMT
ఒక్క సినిమాతో రాణీ ల‌క్ష్మీభాయ్ అయిపోతుందా?
X
క్వీన్ కంగ‌న ర‌నౌత్ ధీర‌త్వం గురించి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ యావ‌త్తూ ఒక వైపు ఉంటే తానొక్క‌ర్తే మ‌రోవైపు ఉంటూ మాఫియా ఆగ‌డాల‌పై పోరాటం సాగిస్తోంది. త‌న‌కు గిట్ట‌ని హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పై నిరంత‌ర పోరాటం సాగిస్తోంది. ఇక నెప్టోయిజం స్టార్ల‌ను అయితే త‌న‌దైన శైలిలో ఆడుకుంటోంది. అందుకే మెజారిటీ భాగం నెటిజ‌నులు కంగ‌న‌కు స‌పోర్టుగా నిలుస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంలో కంగ‌న వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ధ‌తు ల‌భించింది. తాజాగా శివ‌సేన‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న కంగ‌న‌ను ఏకంగా ఝాన్సీ ల‌క్ష్మీ భాయితో పోల్చేస్తున్నారు. ఇంత‌కుముందు రాణీ ఝాన్సీగా న‌టించిన కంగ‌న నిజజీవితంలోనూ శౌర్యంతో పోరాడుతోంద‌న్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

అయితే ఈ పొగ‌డ్త‌లేవీ న‌చ్చ‌ని విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఉన్నట్టుండి కంగ‌న‌పై ఫైర్ అవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాణి లక్ష్మీభాయి శౌర్యాన్ని, త్యాగాలను తాను సినిమా ద్వారా చూపించానని.. నిజ‌జీవితంలోనూ త‌ల వంచేది లేద‌ని కంగ‌న శ‌ప‌థం చేయ‌డంతో ప్ర‌కాష్ రాజ్ దానిపై స్పందించాడు. ``ఒకే ఒక్క సినిమాతో కంగ‌నా ర‌నౌత్ రాణి ల‌క్ష్మీబాయి అయిపోతుందా? అలాంటి రాణితో పోల్చుకుంటే ప‌ద్మావ‌తిగా న‌టించిన దీపికా ప‌దుకొనే.. అక్బ‌ర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్ .. అశోక‌గా న‌టించిన షారుక్ ఖాన్.. భ‌గ‌త్ సింగ్ గా న‌టించిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌.. మంగ‌ళ్ పాండేగా న‌టించిన అమీర్ ఖాన్ .. ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీగా న‌టించిన వివేక్ ఒబేరాయ్ ను కూడా ఆ గొప్పవారితో పోల్చొవ‌చ్చు`` అని ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు. శివ‌సేన వ‌ర్సెస్ కంగ‌న ఎపిసోడ్ల అనంత‌రం ప్ర‌కాష్ రాజ్ ఇలా త‌న‌పై పంచ్ లు వేయ‌డం చూస్తుంటే ఇంత‌కీ ఆయ‌న మ‌ద్ధ‌తు ఏ పార్టీకి? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.