Begin typing your search above and press return to search.

ఐఫోన్ తో అండర్ వాటర్ తీసేసింది

By:  Tupaki Desk   |   26 Jan 2017 12:35 PM GMT
ఐఫోన్ తో అండర్ వాటర్ తీసేసింది
X
ఎన్ని సినిమాలు చేసినా.. పవన్ కళ్యాణ్ తో చేస్తే వచ్చే గుర్తింపే వేరు. అత్తారింటికి దారేది మూవీలో మెయిన్ హీరోయిన్ సమంతను డామినేట్ చేసేంతటి రోల్ చేసి.. ప్రణీతా సుభాష్ బోలెడంత గుర్తింపు సంపాదించినా.. ఆ తర్వాత ఆ జోరు కంటిన్యూ చేయలేకపోయింది. అయినా.. టాలీవుడ్ కి అంత దూరమైపోలేదు. గతేడాది మహేష్ తో కలిసి బ్రహ్మోత్సవంలో ఓ చిన్న పాత్రలో పలకరించింది.

రీసెంట్ గా ఈ భామ ఐఫోన్ 7 కొనుక్కుంది. ఆ ఫోన్ వాటర్ ప్రూఫ్ అవునో కాదో టెస్టింగ్ కూడా చేసేసింది. తను నీటి అడుగుకు వెళ్లడమే కాదు.. తన లేటెస్ట్ ఫోన్ తో వీడియో కూడా తీసి.. అందులోంచే పోస్ట్ చేసింది. 'నేను మీ అందరినీ కూడా నీటి అడుగుకు తీసుకెళ్దామని భావించా. నా ఐఫోన్7తో తీసిన ఓ సెల్ఫీ వీడియో ఇది. ఎలాంటి స్పెషల్ వాటర్ ప్రూఫ్ కేసులు వాడలేదు. ఫోన్ బాగా పని చేస్తోంది. దాని నుంచే పోస్ట్ చేస్తున్నా వాటర్ ప్రూఫ్ ఫీచర్ తెగ నచ్చేసింది' అంటూ వీడియోతో పాటు మెసేజ్ ని కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ప్రణీత.

'అయితే.. మీరు దీన్ని ట్రై చేయకండి. ఎందుకంటే.. మీరు కానీ దీన్ని వదిలేస్తే.. మళ్లీ దొరికే ఛాన్స్ ఏ మాత్రం ఉండదు' అంటూ కాసింత వెటకారం కూడా ఆడింది ప్రణీత. ఇదంతా చూస్తుంటే.. ఐఫోన్7కి కేంపెయిన్ చేస్తున్నట్లు లేదూ! ఇక సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు కానీ.. తమిళ్.. కన్నడలో మాత్రం అవకాశాలు పర్లేదనిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/