Begin typing your search above and press return to search.

ప్రెసెంట్ నా స్టేటస్ సింగిలే: కుర్రహీరోయిన్

By:  Tupaki Desk   |   7 Jun 2021 11:30 PM GMT
ప్రెసెంట్ నా స్టేటస్ సింగిలే: కుర్రహీరోయిన్
X
ఈ మధ్యకాలంలో ఫేవరేట్ హీరోయిన్స్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడంలో ఎంతో ఆసక్తి చూపిస్తారు ఫ్యాన్స్. అయితే మూవీస్ విషయం పక్కనపెడితే.. హీరోయిన్ లవ్ - అఫైర్స్ గురించి తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ఇంటరెస్టింగ్ గానే ఉంటారు ఫ్యాన్స్. తాజాగా ఓ హీరోయిన్ సోలో లైఫ్ పై స్పందించింది. ఆ కుర్రబ్యూటీ ఎవరో కాదు హీరోయిన్ మాళవిక శర్మ. ఈ భామ గురించి తెలుగు యువతకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అమ్మడు డెబ్యూ మూవీతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ముంబైలో పుట్టిపెరిగిన మాళవిక.. 19వ యేటనే హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన నేలటికెట్టు సినిమాతో వెండితెర పై అడుగుపెట్టింది.

ఇక తన ఫస్ట్ సినిమాలోనే అందాలన్నీ ఆరబోసి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ మొదలుపెట్టిన మాళవిక.. కొన్ని టాప్ టీవీ కమర్షియల్ యాడ్స్ లో మెరిసింది. మొదటి సినిమా ఆకట్టుకోక పోయినా అమ్మడి అందాలకు మాత్రం ఫుల్ మార్కులే వేశారు ప్రేక్షకులు. అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఏ పోస్ట్ పెట్టినా అలా క్షణాలలో ఫ్యాన్స్ వైరల్ చేసేస్తారు. ఈ భామ వ్యక్తిగతంగా లాయర్ అవ్వాలని అనుకుని ఎల్.ఎల్.బి కూడా చదివింది. అయితే ఖాళీ దొరికితే మాత్రం గ్లామరస్ ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ హీటెక్కిస్తోంది.

తాజాగా ఈ భామ 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' పై నమ్మకం లేదంటోంది. అలాగే ప్రెసెంట్ ఆమె స్టేటస్ కూడా సింగిల్. ఎవరితో డేటింగ్ లో కూడా లేనని చెబుతోంది వయ్యారి. ప్రస్తుతం సోలో లైఫ్ బాగుంది. ఫ్యూచర్ లో లవ్ డేటింగ్ విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను. తనకంటూ పలు రూల్స్ పెట్టుకున్నానని.. అలాగే లైఫ్ కూడా ఇలాగే ఎవరి పై డిపెండ్ అవ్వకుండా లీడ్ చేయాలనీ పేరెంట్స్ చెప్పారని అంటోంది. మొత్తానికి అమ్మడు చాలా ప్లానింగ్ లో ఉంది. ఫ్యూచర్ లో లాయర్ వృత్తితో పాటు యాక్ట్రెస్ లైఫ్ కూడా కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఈ భామ చివరిగా రామ్ సరసన రెడ్ సినిమాలో మెరిసింది. ప్రస్తుతం అమ్మడు స్టేటస్ సింగిల్ అనేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.