Begin typing your search above and press return to search.
నాని హీరోయిన్ కు సూర్య మూవీ చాన్స్
By: Tupaki Desk | 21 Jan 2021 6:32 AM GMTనాని హీరోగా రూపొందిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటించిన ప్రియాంక మోహన్ వరుసగా కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. తెలుగులో ఈ అమ్మడు నానికి జోడీగా నటించిన గ్యాంగ్ లీడర్ లో ఈ అమ్మడు ఆకట్టుకుంది. పక్కింటి అమ్మాయి మాదిరిగా అనిపించే ఈ అమ్మడు కోలీవుడ్ లో తాజాగా సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఎంపిక అయ్యింది. ప్రముఖ తమిళ దర్శకుడు పాండి రాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న సూర్య సినిమాలో ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాండిరాజన్ మూవీ విభిన్నమైన కథలతో రూపొందుతుంది. కనుక ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారట. ప్రియాంక మోహన్ సౌత్ లోనే ట్రెండ్డింగ్ లో ఉన్న హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.