Begin typing your search above and press return to search.

#పుష్ప‌.. బ‌న్ని వ‌ర్సెస్ బ‌న్ని! ఆ షాడో ఎవ‌రు?

By:  Tupaki Desk   |   29 Jan 2021 11:30 PM GMT
#పుష్ప‌.. బ‌న్ని వ‌ర్సెస్ బ‌న్ని! ఆ షాడో ఎవ‌రు?
X
స్క్రీన్ ప్లే స్పెష‌లైజేష‌న్ లో ఆర్య సుక్కూని కొట్టేవాళ్లే లేరు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి అంత‌టివారే సుకుమార్ ట్యాలెంట్ ని ప‌బ్లిక్ వేదిక‌ల‌పై పొగిడేశారంటే అర్థం చేసుకోవాలి. ఆర్య ఫ్రాంఛైజీతో పాటు 1-నేనొక్క‌డినే- నాన్న‌కు ప్రేమ‌తో- రంగ‌స్థ‌లం చిత్రాల‌కు అత‌డు క్రియేట్ చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆయా సినిమాలు జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అభిమానుల మ‌న్న‌న‌లు పొందాయి అంటే.. సుక్కూ టెక్నిక్ అలాంటిది. సుకుమార్ బ్రాండ్ కి అన్ని వేళ‌లా క్రేజు పెరుగుతోంది అంటే దాని వెన‌క టెక్నికాలిటీస్ .. స్క్రీన్ ప్లే మాయాజాలం వ‌గైరా వ‌గైరా బ‌లంగా ప‌ని చేశాయ‌న్న‌ది విశ్లేష‌కులు చెప్పే మాట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం పుష్ప‌లోనూ అలాంటి మెరుపులకు కొద‌వ ఉండ‌ద‌ని తెలుస్తోంది. ఇందులో స్క్రీన్ ప్లే ప‌రంగా ట్విస్టులు షాక్ లు షేక్ చేస్తాయ‌న్న‌ది ఇన్ సైడ్ గుస‌గుస‌. అంతేనా.. `పుష్ప`లో ఒక‌రు కాదు ఇద్ద‌రు హీరోలు! అంటూ ఇప్పుడు స‌రికొత్త ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. బన్నీ ఒక్కడే కాదు.. మ‌రో హీరో ఉన్నాడు హిడెన్ గా అన్న‌దే ఇక్క‌డ ట్విస్టు. తాజాగా రిలీజ్ చేసిన పుష్ప కొత్త‌ పోస్టర్ ‌లో ఉన్నది బ‌న్ని కాదు మరొకరు.. సీక్రెట్ బయటపడింది! అంటూ ప్ర‌చారం సాగిస్తున్నారు.

ఈ మూవీలో బ‌న్ని గంధపు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ గా.. లారీ డ్రైవ‌ర్ గా క‌నిపిస్తారు. చిత్తూరు యాస‌‌లో మాట్లాడతారు. డీ గ్లామర్ పాత్ర‌తో పాటు బిజినెస్ మేన్ లుక్ తోనూ స‌ర్ ప్రైజ్ చేస్తాడ‌ని ఆరంభ‌మే గుస‌గుస‌లు వినిపించాయి.

13 ఆగస్టు 2021న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నామ‌ని ఇంత‌కుముందే సుక్కూ అండ్ టీమ్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌గా అది వైర‌ల్ అయ్యింది. పోస్ట‌ర్ లో అల్లు అర్జున్ మేకొవర్ చాలా కొత్తగా ఉంది. దీంతో పాటే ఇందులో ఇద్దరు హీరోలు ఉన్నారని క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. రిలీజ్ డేట్ పోస్టర్ లో అడవిలో పని చేసే కూలీలందరూ గొడ్డళ్లను పట్టుకుని కనిపించగా.. అల్లు అర్జున్ మాసీ లుక్ తో వారి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ ‌లో హీరో కాలికి ఐదు వేళ్లు మాత్రమే క‌నిపించ‌డంతో... అస‌లు గుట్టు లీకైంది. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో అల్లు హీరో కాలికి ఆరు వేళ్లు చూపించారు. కానీ తాజా పోస్ట‌ర్ లో ఐదు వేళ్లే క‌నిపిస్తున్నాయి. అంటే ఆ బ‌న్ని వేరు.. ఈ బ‌న్ని వేరు. ఇద్ద‌రు హీరోలు న‌టిస్తున్నారు! అంటూ ఒక‌టే ప్ర‌చారం వేడెక్కించేస్తున్నారు.

బ‌న్ని ద్విపాత్రాభిన‌యం నిజం. కానీ వేరే హీరో ఎవ‌రు? అన్న‌దే స‌స్పెన్స్. ఏదేమైనా స్క్రీన్ ప్లే మాయాజాలంతో షాక్ లు తినిపించే సుక్కూ పుష్ప‌లో అలాంటి ట్విస్టును ఎలా రివీల్ చేస్తారో చూడాల‌న్న క‌సి పెరిగింది. తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం-హిందీ స‌హా పాన్ ఇండియా రేంజులో పుష్ప‌ను రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఎంచుకున్న క‌థాంశంలో పాన్ ఇండియా అప్పీల్ ట్రై చేశార‌ని అర్థ‌మ‌వుతోంది.