Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరిః ఇద్దరు మొనగాళ్లు
By: Tupaki Desk | 1 Feb 2020 2:30 PM GMTనగరంలో ఇద్దరు మొనగాళ్లు దిగారు. మోస్ట్ వాంటెడ్ మొనగాళ్ల జాబితాలో ఆ ఇద్దరి పేర్లను టాప్ 2లో చూడొచ్చు. ఇంతకీ ఎవరా మొనగాళ్లు? అంటే విడిగా చెప్పాల్సిన పనేం లేదు. అందులో ఒకరు ఆర్జీవీ.. ఇంకొకరు ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్. గత కొంతకాలంగా సరైన హిట్టు లేక సతమతమైన ఈ గురుశిష్యులు మళ్లీ స్వింగులోకి వచ్చినట్టే కనిపిస్తోంది.
ఓవైపు వయసుడిగిపోయినా ఆర్జీవీలో ఎనర్జీ ఎంతమాత్రం తగ్గడం లేదు. ఆయన నిరంతరం ఏదో ఒక వివాదంతో అంటకాగుతూ నేనింకా మొనగాడినే అని నిరూపిస్తున్నారు. మరోవైపు శిష్యుడు పూరి సన్నివేశం అంతంత మాత్రమే. మొన్న ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ తగలకపోయి ఉంటే ఇంకా డీలా పడిపోయి ఉండేవాడే. ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా పూరీలోకి 1000 వోల్టుల ఎనర్జీ ప్రవేశించింది. ఆ క్రమంలోనే తనలోని మొనగాడిని నిద్ర లేపి దేవరకొండతో ఫైటర్ సినిమాకి సంకల్పించాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం రౌడీ కొండ రూపురేఖల్నే మార్చేస్తూ పూరి మరోసారి తనదైన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనని కాదు అన్న హీరోలందరికీ ధీటుగా దేవరకొండను పాన్ ఇండియా స్టార్ ని చేయాలన్న పంతంతో ఉన్నాడు. అందుకేనేమో ఇదిగో ఇలా గురువుతో కలిసి ఇలాంటి ఫోజిచ్చారు. ఏదైనా ఖాళీగా ఉన్న బాక్సింగ్ రింగ్ లోకి దించితే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునేంత కసిగా ఉన్నారు వీళ్లు. ఈ ఫోటో చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమవుతోంది.
అదంతా సరే కానీ... ఇలా పిడికిలి బిగించి ఎవరికి సవాల్ విసురుతున్నట్టు? ఈ ఫోజుకు అర్థం ఏమిటి? ఏమో ఎవరికీ తెలీదు కానీ... ఆ ఇద్దరినీ చూడగానే ఓ వీరాభిమాని `ఇద్దరు మొనగాళ్లు` అంటూ అదిరిపోయే కామెంట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పూరి గారు నేను మీకంటే బెటర్ ఫైటర్ ని అంటూ వేరొక అభిమాని కొంటెగా ట్వీట్ చేశాడు. గ్రేట్ పర్సన్స్ ఇన్ వరల్డ్ నో మోర్ వర్డ్స్ అంటూ వేరొకరు క్యాప్షన్ ఇచ్చారు ఈ ఫోటోకి. నో నో మీరిద్దరూ గే కపుల్ లా ఉన్నారు! అంటూ ఒకరైతే గట్టిగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఇద్దరు డ్రింకర్స్! అంటూ అదిరిపోయే ఝలక్ నే ఇచ్చాడు వేరొక అభిమాని. పూరి అండ్ రోటీ దోస్తానా! అంటూ కొంటెగా కామెంట్లు చేసిన వాళ్లు ఉన్నారు. మొత్తానికి అందరిపైనా పంచ్ లు వేసే ఆ ఇద్దరిపైనా అభిమానులు గ్యాప్ అన్నదే లేకుండా పంచ్ లు విసిరేశారు. మరి వాటిని క్యాచ్ చేసిన ఆర్జీవీ అండ్ పూరి ఏమని సమాధానాలిస్తారో చూడాలి.