Begin typing your search above and press return to search.
వర్మ దీన్ని అయినా సీరియస్ గా చేస్తాడా?
By: Tupaki Desk | 2 Jan 2020 5:13 AM GMTరామ్ గోపాల్ వర్మ ఈ మద్య కాలంలో రోజు ఏదో ఒక విషయం తో వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. గతంలో ఆయన సినిమాలు మాట్లాడేవి. కాని ఇప్పుడు ఆయన చేస్తున్న అల్లరి పనులు.. సోషల్ మీడియా పోస్ట్ లు ఆయన గురించి మీడియా లో మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఇటీవల ఒక హీరోయిన్ కాళ్లకు నమస్కారం చేయడం మొదలు స్టేజ్ పై చెత్త డాన్స్ తో బాబోయ్ నీకు దండంరా బాబు అనుకునే వరకు అన్ని కూడా వర్మ స్థాయిని దిగజార్చుతున్నాయంటూ ఆయన అభిమానులు స్వయం గా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు అద్బుతమైన చిత్రాలను తీసిన వర్మ ఇప్పుడు వివాదం కోసం సినిమాలు చేస్తున్నాడు. అవి కాస్త చెత్త.. పరమ చెత్త సినిమాలుగా నిలుస్తున్నాయి. వర్మ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. గతంలో దావూద్ ఇబ్రహీంపై సినిమా తీసిన వర్మ ఇప్పుడు ఆయనపైనే ఒక వెబ్ సిరీస్ ను తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. చాలా కాలంగా తాను దావూద్ ఇబ్రహీంపై రీసెర్చ్ చేస్తున్నాను. చాలా మ్యాటర్ దొరికింది. దాంతో వెబ్ సిరీస్ తీస్తేనే న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నట్లుగా వర్మ ప్రకటించాడు.
రామ్ గోపాల్ వర్మ గతంలో మాదిరి గా ఈ వెబ్ సిరీస్ ను కూడా లైట్ గా తీసుకుని తెరకెక్కిస్తాడా లేదంటే సీరియస్ గా తీసుకుని పాత వర్మను చూపిస్తాడా అనేది చూడాలి. వర్మ ఇప్పటికే జనాల్లో నమ్మకం కోల్పోయాడు. వర్మ ఏదైనా ప్రాజెక్ట్ మొదలు పెట్టినా.. తెరకెక్కించినా కూడా జనాలు చాలా లైట్ తీసుకుంటున్నారు. వర్మ సినిమా అంటే బూతు లేదంటే వివాదాస్పదం అన్నట్లుగా పరిస్థితి మారింది. మరి దావూద్ ఇబ్రహీం వెబ్ సిరీస్ తో తనపై ఉన్న మచ్చను వర్మ మార్చుకుంటాడా లేదంటే దాన్ని మరింత పెద్దగా చేసుకుంటాడా అనేది చూడాలి.