Begin typing your search above and press return to search.

ఆర్ఆర్‌ఆర్‌ దోస్తీ సాంగ్‌ విజువల్స్ ట్రీట్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   1 Aug 2021 8:39 AM GMT
ఆర్ఆర్‌ఆర్‌ దోస్తీ సాంగ్‌ విజువల్స్ ట్రీట్ అదుర్స్‌
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రతి సినిమా కూడా మ్యూజికల్‌ హిట్ గా నిలుస్తుంది. కీరవాణి నుండి రాజమౌళి తనకు కావాల్సిన అద్బుతమైన ట్యూన్స్ ను రాబట్టుకుంటూ ఉంటారు. ఇద్దరి మద్యలో ఉన్న ర్యాపో కారణంగా ప్రతి పాట కూడా మరో లెవల్‌ అన్నట్లుగానే ఉంటాయి. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా పై ఉన్న బజ్‌ నేపథ్యంలో ఈ సినిమా లోని పాటలు కూడా అంతకు మించి ఉంటాయనే నమ్మకంతో అంతా ఉన్నారు. అనుకున్నట్లుగానే నేడు స్నేహితుల దినోత్సవం సందర్బంగా విడుదల అయిన దోస్తీ సాంగ్ ఆకట్టుకుంది. ప్రమోషనల్‌ సాంగ్‌ దోస్తీ ని ఏదో సాదా సీదాగా కానివ్వకుండా అయిదు భాషల్లో అయిదుగురు దిగ్గజ సింగర్స్ తో ఈ పాటను కీరవాణి పాడించాడు.

అద్బుతమైన ట్యూన్‌ ను అందించడమే కాకుండా కథనుసారంగా ఈ సినిమాలోని ఇద్దరు హీరోల పాత్రలను కాస్త పరిచయం చేస్తూ లిరిక్స్‌ ను రాయించారు. అద్బుతమైన సాహిత్యం అంతకు మించిన ట్యూన్‌ మరియు గానం కు తోడు విజువల్స్ ను కూడా అద్బుతంగా చిత్రీకరించారు. సినిమా మొదటి నుండి కూడా ఇద్దరు హీరోల్లో ఒకరు నీరు మరొకరు నిప్పు అన్నట్లుగా ప్రమోట్‌ చేస్తున్నారు. పాటలో కూడా అలాగే చూపించారు. ఒక వైపు భగ భగ మంటూ మంటలు వస్తూ మరో వైపు నీటి జల్లు ఎఫెక్ట్‌ ను దర్శకుడు చూపించిన తీరు అద్బుతంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రమోషనల్‌ సాంగ్ ను కూడా ఇంత మనసు పెట్టి కాన్సెప్ట్‌ తో చేయడం అంటే కేవలం రాజమౌళికే చెల్లింది అంటున్నారు.

రాజమౌళి ఈ పాట విజువల్స్ విషయంలో కనబర్చిన శ్రద్ద ను చూస్తుంటే సినిమా ఎలా ఉందో ఊహించుకుంటూ ఉంటేనే ఒల్లు గగుర్లు పొడుస్తున్నాయనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అద్బుతమైన లిరిక్స్ తో పాటు కన్నుల వింధు చేసే విజువల్స్ వల్ల దోస్తీ పాట ఒక అద్బుతంగా నిలిచిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆర్‌ ఆర్‌ ఆర్‌ లో ఇద్దరు హీరోల దోస్తీకి అద్దం పట్టేలా పాట ఉంది. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ లు చివర్లో అలా నడుచుకుంటూ వస్తుంటే అబ్బ అన్నట్లుగా రెండు కళ్లు చాలడం లేదు అంటూ అభిమానులు కళ్లు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నారు.

పాట మొత్తం కూడా నీరు నిప్పుల కలయికలో చాలా అద్బుతంగా సాగింది. సింగర్స్ అందరిని అలా కలిపి చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని.. వారితో కీరవాణి ఉండటం మరింత గా పాటకు హైలైట్ గా నిలిచింది. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా నుండి స్నేహితుల దినోత్సవం సందర్బంగా వచ్చిన ఈ పాట రాబోయే స్నేహితుల దినోత్సవం వరకు మారు మ్రోగుతూనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఫ్రెండ్‌ షిప్ డే సాంగ్‌ అంటే రాబోయే పది పదిహేను ఏళ్ల వరకు దోస్తీ సాంగ్‌ గుర్తుకు వస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా లోని విజువల్‌ ట్రీట్‌ ఎలా ఉండబోతుందో శాంపిల్ గా ఈ పాటలో చూపించినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లగల సత్తా ఈ సినిమాకు ఉందంటున్నారు. ఇంటర్నేషనల్‌ లాంగ్వేజ్ ల్లో రాబోతున్న ఈ సినిమా తో జక్కన్న హాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్‌ స్థాయిలో నిలుస్తాడనే నమ్మకం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న మా.. మన దర్శకుడు అయినందుకు
అదృష్టవంతులం అంటూ కూడా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.