Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కంటికి కునుకైనా ప‌ట్ట‌నివ్వ‌వా అందాల రాశీ

By:  Tupaki Desk   |   15 Oct 2020 8:17 AM GMT
ఫోటో స్టోరి: కంటికి కునుకైనా ప‌ట్ట‌నివ్వ‌వా అందాల రాశీ
X
అవును.. కంటికి కునుకైనా ప‌ట్ట‌నివ్వ‌ని అందాల రాశీ .. ఈ లుక్కు చూశాక ప‌డిపోవాల్సిందే. రాశీ స్లిమ్మింగ్ హొయ‌లేమిటో చూస్తే ప‌రేషానే సుమీ. ఇటీవ‌ల కుర్ర‌కారుకి నిదుర క‌రువ‌య్యేలా చేస్తున్న రాశీ.. నిరంత‌రం జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తూ హార్డ్ వ‌ర్క్ చేస్తున్న తీరు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

టాలీవుడ్ కి న‌వ‌త‌రం భామ‌ల వెల్లువ ఆషామాషీగా ఏం లేదు. ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీతో బ‌రిలో దిగి అప్ప‌టికే ఉన్న అందాల క‌థానాయిక‌ల్ని వెన‌క్కి నెట్టేస్తున్నారు. అందుకే అందాల రాశీ ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటోంది. ఇంత‌కుముందు తో పోలిస్తే బొద్దుత‌నం త‌గ్గి చాలా స్లిమ్ అయిపోయింది. ట్రిమ్మింగ్ లుక్ తో ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోల్ని షేర్ చేసి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఫీల‌ర్స్ వ‌దులుతోంది.

ఇక కెరీర్ ప‌రంగా హిట్లేవీ లేక‌పోయినా కానీ.. వ‌రుస‌గా సినిమాలకు సంత‌కాలు చేయ‌గ‌లుగుతోందంటే త‌న‌కు ఉన్న డెడికేష‌న్ .. క‌మిట్ మెంట్ .. అంత‌కుమించి ఫిజిక‌ల్ ఫిట్నెస్ ప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న తీరు .. హార్డ్ వ‌ర్క్ అనే చెప్పాలి. ప్ర‌తిరోజూ పండ‌గే లాంటి హిట్టు కొట్టాక కాస్తంత స్పీడ్ పెంచాలని భావించినా కానీ రాశీ దూకుడుకి క‌రోనా లాక్ డౌన్ బ్రేక్ వేసింది. అటు త‌మిళంలోనూ కెరీర్ ప‌రంగా స్పీడ్ పెంచే ప్లాన్ తో ఉందిట ఈ అమ్మ‌డు. అందుక‌నే జిమ్ముల్లో ఈ నిరంత‌ర త‌ప‌న‌. 4 ఏఎం నిదుర లేచే సెల‌బ్రిటీ క్ల‌బ్ లో ఈ అమ్మ‌డి పేరు చేరింది మ‌రి. నిదుర లేచి డంబెల్స్ ఎత్తుతూ .. బ‌రువుల్ని అమాంతం ఎత్తేస్తూ ఇలా ట్రిమ్ అయిపోతోంది. లేటెస్టుగా రాశీ స్నాప్ యూత్ లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.