Begin typing your search above and press return to search.
లెజెండ్ రఘుపతి వెంకయ్యను మరిచారు!
By: Tupaki Desk | 15 March 2019 6:00 PM ISTతెలుగు వాడు.. సినిమాకి ఆద్యుడిని మరిచిపోయిన ఘనత తెలుగువారిదే! తెలుగు చలనచిత్ర రంగ పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు పేరు మీదనే ప్రతిభావంతులకు నిరంతరం అవార్డులు అందుతున్నాయి. అయినా ఆయనను జనం గుర్తు చేసుకున్నదే లేదు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా కొందరు ప్రభృతులు ఫిలింఛాంబర్ లో దండలు వేసి గుర్తు చేసుకున్నా ఇండస్ట్రీలో ప్రముఖులెవరికీ గుర్తుకొచ్చినట్టు కనిపించలేదు. అలాగే సినీమీడియా సైతం ఆయన గురించి ప్రత్యేక కథనాల్ని వేసినదీ లేదు. రఘుపతి వెంకయ్య నాయుడు స్వస్థలం మచిలీపట్నం. ప్రఖ్యాత తెలగ వీర యోధుల కుటుంభానికి చెందిన ఆయన తండ్రి - తాత ముత్తాతల కాలంనుండీ సైన్యాలలో సేనానాయకులుగా కొనసాగారు. ఈస్టు ఇండియా కంపెనీలో.. బ్రిటిష్ సైన్యాలలోనూ తెలగ రెజిమెంట్ ల లో సుబేదార్లుగా సేవలందించారు.
రఘుపతి వెంకయ్య నాయుడు 15 అక్టోబరు 1887లో జన్మించారు. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ నాయుడు కి సోదరుడు. తన 17వ ఏట వెంకయ్య ఫొటోగ్రఫీలో రాటు దేలారు. 1910లో ఒక `క్రోమో మెగాఫోను`ను - 4000 అడుగుల ఫిలిమ్ ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించిన ఘనుడాయన. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించే ప్రయత్నం చేశారు. 1912లో మద్రాసులో `గెయిటీ` అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాల) నిర్మించారు. తరువాత `క్రౌన్` - `గ్లోబ్` సినిమా హాళ్ళను కూడా నిర్మించారు. తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ ను (ఆర్.ఎస్.ప్రకాష్) సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలకు పంపాడు. జర్మనీ- ఇటలీ-అమెరికా దేశాలు పర్యటించారు ఆయన కుమారుడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు సిసిల్ బి డెమిల్లి `టెన్ కమాండ్ మెంట్స్` చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు.
ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ `స్టార్ ఆఫ్ ది ఈస్ట్`ను స్థాపించాడు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (తొలి తెలుగువాడి సినిమా అన్నారు). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. డి కాస్టెల్లో అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు మత్స్యావతార్ - నందనార్ - గజేంద్రమోక్షం వంటి మరికొన్ని మూకీ సినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య - వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అటుపై తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్ తో కలిసి `గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్` , `జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్` స్థాపించారు. విశ్వామిత్ర - మాయామధుసూదన - పాండవ నిర్వహణ - రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు. 1941 లో తన 53వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు. అప్పులవారికి చాలామొత్తాలు చెల్లించవలసినందున ఆయన చివరికాలానికి ఆస్తులు కరిగిపోయాయి. ఆయన సేవలను గుర్తించిన అంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1980 వ సంవత్సరములో రఘుపతి వెంకయ్య అవార్డు ను నెలకొల్పినారు. సినీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతి ప్రధానం చేస్తారు. వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. తెల్లటి గోడమీద సినిమా `ప్రొజెక్ట్` చేసిన మొదటివాడు ఆయనే. అలా దానిని `గోడమీది బొమ్మ` అనేవారు. ప్రకాష్ కాకినాడ దగ్గర భక్త మార్కండేయ సినిమా తీశారు. అందులో కాకినాడ రాజారత్నం అనే ఆవిడ ఒక ముఖ్యపాత్ర ధరించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక. రఘుపతి వెంకయ్య, రఘుపతి సూర్యప్రకాశ్ తెలుగుసినిమా పరిణామ మార్గదర్శకులు. తండ్రీ కొడుకులిద్దరూ సినిమా కోసమే కష్టపడ్డారు. నష్టపోయారు. అంతటి చరిత్ర ఉంది. ది గ్రేట్ లెజెండ్ రఘుపతి వెంకయ్య వర్ధంతి నేడు.. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం మీకోసం..