Begin typing your search above and press return to search.

'నెట్ ఫ్లిక్స్' వెబ్ సిరీస్ ల వైపు యువదర్శకుడు

By:  Tupaki Desk   |   23 April 2020 2:40 PM IST
నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ల వైపు యువదర్శకుడు
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వైపు నటుడిగా - మరో వైపు దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ రాహుల్ రవీంద్రన్. ఇటీవలే కింగ్ నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' సినిమా రూపొందించి ప్లాప్ అందుకున్నాడు. ఆ సినిమా నష్టాలనే కాదు.. విమర్శలు కూడా తెచ్చిపెట్టింది. అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యాడు రాహుల్. ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి 'చిలసౌ' సినిమాను రూపొందించి మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా మంచి పేరుతో పాటు జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చింది.

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రాహుల్ ఖాళీగా ఉండకుండా కొత్త సినిమాలకోసం కథలను రాసుకుంటున్నాడట. ఓ వైపు వెబ్ సిరీస్ రూపొందించే ప్లాన్ లో కూడా ఉన్నాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ స్క్రిప్ట్ పనులలో బిజీ అయ్యాడట. ఈ వెబ్ సిరీస్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ తో పాటు వెన్నెల కిశోర్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్‌ గా ఈ వెబ్ సిరీస్ ను తీయబోతున్నాడు రాహుల్. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం.