Begin typing your search above and press return to search.
ఫ్యామిలీ తో సినిమా ప్లాన్ చేస్తున్న రాజమౌళి కొడుకు
By: Tupaki Desk | 26 Dec 2019 4:17 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో రాజమౌళి అతని అన్నయ్య కీరవాణి మధ్య ఎలాంటి ఆత్మీయ అనుబంధం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ తను డైరెక్ట్ చేసిన సినిమాలన్నిటికీ కీరవాణి నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటూ వచ్చాడు రాజమౌళి. అసలు కీరవాణి లేని రాజమౌళి సినిమాను చూడలేం అన్నట్టు గా ఆడియన్స్ కి ఎక్కేసింది ఈ కాంబో.
అయితే ఇప్పుడు వీళ్ళ నెక్స్ట్ జెనేరేషణ్ నుండి మరో కాంబో రెడీ అవుతుంది. అవును రాజమౌళి కొడుకు , కీరవాణి కొడుకులు కలిసి ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది. లేటెస్ట్ గా 'మత్తు వదలరా' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సింహ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. కార్తికేయ కి నన్ను హీరోగా పెట్టి, అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ లో ఒక సినిమా నిర్మించాలని ఉంది. అయితే అదెప్పుడు చేస్తామో మాత్రం తెలియదు అంటూ చెప్పాడు.
ఇక బాబాయ్ సినిమా లో క్యారెక్టర్ అక్కర్లేదు జస్ట్ ఒకే ఒక్క షాట్ అయినా చాలు నటుడిగా జన్మ ధన్యమై నట్టే అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు. మరి కార్తికేయ లాగే జక్కన్నకి కూడా తమ పిల్లలతో సినిమా తీయాలనే ఆలోచన వస్తే జక్కన్న ఫ్యామిలీ ఇప్పటి నెక్స్ట్ జెనరేషన్ ఇండస్ట్రీ లో సెట్ అయినట్టే. ప్రస్తుతం కీరవాణి కొడుకులు 'మత్తు వదలరా' తో పాజిటీవ్ టాక్ అందుకొని రెండో సినిమాకి రెడీ అవుతున్నారు.