Begin typing your search above and press return to search.
నేను సింప్లిసిటీ ఏంటండీ - నాది లగ్జరీ లైఫ్ : రజినీ
By: Tupaki Desk | 7 Nov 2018 9:59 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ఒక స్టార్ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వందల కోట్ల సినిమాలను చేసే అతి కొద్ది సౌత్ హీరోల్లో రజినీకాంత్ ఒకరు. అలాంటి రజినీకాంత్ చాలా సింప్లిసిటీ జీవితాన్ని గడుపుతారని - ఆయన వేషధారణ - ప్రవర్తన అన్నీ కూడా ఒక సాదారణ వ్యక్తి తరహాలో ఉంటాయని అంతా అంటూ ఉంటారు. ఒక సూపర్ స్టార్ అయినా కూడా హిమాలయాలకు వెళ్లినప్పుడు రోడ్డు మీద టీ తాగడం - సాదారణ మనుషులతో మాట ముచ్చట వంటి వాటి వల్ల రజినీకాంత్‌కు సింప్లీసిటీ అంటూ పేరు వచ్చింది.
ఇదే విషయాన్ని రజినీకాంత్ వద్ద ప్రస్థావిస్తే మాత్రం నేను సింప్లీసిటీ ఏంటీ అంటూ తిరిగి ప్రశ్నిస్తారు. తాజాగా రజినీకాంత్ ‘2.ఓ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలోనే తాను సింప్లీసిటీ అనుకునే వారికి ఒక ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు.
ఇంటర్వ్యూలో భాగంగా ఇంత సింపుల్ గా మీరు ఎలా జీవితాన్ని గడిపేయగలుగుతున్నారు అంటూ మీడియా వ్యక్తి ప్రశ్నించిన సమయంలో రజినీకాంత్ సమాధానంగా... చెన్నైలోని అతి ఖరీదైన ఏరియా పోయేస్ గార్డెన్ లో నేను ఉంటున్నాను - వీఐపీలు మాత్రమే వాడే కార్లు నా వద్ద చాలా ఉంటాయి - ఫైవ్ స్టార్ హోటల్ లో తింటాను - విమానాల్లో తిరుగుతాను. ఇంత లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న నన్ను సింపుల్ గా ఉన్నారు అంటూ మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు. నాది సింపుల్ జీవితం కానే కాదు - నాది చాలా లగ్జరీ లైఫ్ అంటూ క్లారిటీ ఇచ్చాడు.
బయటకు వచ్చినప్పుడు మేకప్ లేకుండా - జుట్టుకు రంగు వేసుకోకుండా - బట్టతలతో వచ్చినంత మాత్రాన జనాలు సింపుల్ అనేసుకుంటున్నారు. మిగిలినవి చూడకుండా ఆయన్ను ఒక సింపుల్ మనిషి అంటూ భావిస్తున్నారు. కాని తన లగ్జరీ జీవితం గురించి ఆయనే చెప్పుకొచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. ఇలా ఇతర ఏ హీరోలు కూడా ఇంత బహిరంగంగా బయటకు చెప్పరేమో అంటూ రజినీ ఫ్యాన్స్ గొప్పలు చెప్పుకుంటున్నారు.