Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీకులు ముంబైలో పాగా వేశారు!

By:  Tupaki Desk   |   1 Feb 2021 3:56 AM GMT
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీకులు ముంబైలో పాగా వేశారు!
X
చూస్తుంటే ఆ ఇద్ద‌రూ క‌లిసి బాలీవుడ్ ని కొట్టేసేట్టే క‌నిపిస్తున్నారు. చాలా హుషారుగా ముంబై ప‌రిశ్ర‌మ‌లో చ‌క్క‌ర్లు కొడుతూ నిరంత‌రం కెమెరా కంటికి దొరికేస్తున్నారు. క‌లిసి లంచ్ లు డిన్న‌ర్ లు వీకెండ్ సెల‌బ్రేష‌న్స్ అంటూ వేడి పెంచేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ భామ‌ల స్నేహం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎవ‌రా ఇద్ద‌రు? అన్న‌ది ఆరా తీస్తే.. ఇంకెవ‌రు.. ర‌కుల్ ప్రీత్ - ప్ర‌గ్య జైశ్వాల్.

దిల్లీ బ్యూటీ ర‌కుల్ ముంబై ప‌రిశ్ర‌మ‌లో పెద్ద స్టార్ హీరోయిర్ కావాల‌నుకుంటోంది. ప్ర‌స్తుతం మ‌ల్హోత్రా స‌ర‌స‌న.. త‌న మెంటార్ దేవ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనూ అవ‌కాశం ద‌క్కించుకుంది. ఇక ఇన్నాళ్లు ఎంతో ట్రై చేసి విసిగిపోయిన ముంబై బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ కి ఆశించిన జాక్ పాట్ త‌గిలింది. త‌న వెయిటింగ్ ఫ‌లించి ఇటీవ‌లే స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకుంది.

అంతేకాదు...రకుల్ ప్రీత్ సింగ్ - ప్రగ్యా జైస్వాల్ ఇద్దరూ గత కొన్ని రోజులుగా ర‌క‌ర‌కాల‌ ప్రాజెక్టుల కారణంగా ముంబై మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌స్తున్నారు. ఆ ఇద్ద‌రూ క‌లిసే ర‌క‌ర‌క‌లా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. దీంతో ఇటీవ‌ల మ‌రింత దగ్గరి స్నేహితులయ్యారు. గొప్ప అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. అంతకుముందు వీరిద్దరూ కలిసి `జయ జానకి నాయక` (2017) అనే తెలుగు యాక్షన్ డ్రామాలో నటించారు. ఆ త‌ర్వాత స్నేహం మ‌రింత‌గా పెరిగింది.

ప్ర‌స్తుతం ముంబైలోనే పాగా వేశారు ఆ ఇద్ద‌రూ. రకుల్ ప్రీత్ సింగ్ - ప్రగ్యా జైస్వాల్ ఇద్దరూ కలిసి ఈ ఆదివారం లంచ్ కి వెళ్లారు. బోజ‌నం ముగించి వారాంతం కొంత విలువైన సమయాన్ని క‌లిసి గడిపారు. చూస్తుంటే ఆ ఇద్ద‌రూ గ‌ట్టి ప్లాన్ లోనే ఉన్నారు! అంటూ ముంబై మీడియాలో కామెంట్లు వేడెక్కిపోతున్నాయ్. ర‌కుల్.. ప్ర‌గ్య ఇద్ద‌రూ ఇటు సౌత్ లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న సంగ‌తి తెలిసిన‌దే. ఆ ఇద్ద‌రూ టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీకులుగానూ పాపుల‌ర‌య్యారు.