Begin typing your search above and press return to search.

ఆసియాలోనే అతిపెద్ద థియేట‌ర్ హంగామా

By:  Tupaki Desk   |   29 Aug 2019 8:45 AM GMT
ఆసియాలోనే అతిపెద్ద థియేట‌ర్ హంగామా
X
ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద థియేట‌ర్ గా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ఐమ్యాక్స్ ఘ‌నుతికెక్కింది. ద‌శాబ్ధాల పాటు ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ గురించి ప్రపంచ‌వ్యాప్తంగా అభిమానులు ముచ్చ‌టించుకున్నారు. విదేశాల నుంచి హైద‌రాబాద్ కి విచ్చేసిన అతిధులు ఐమ్యాక్స్ ని సంద‌ర్శించ‌కుండా వెళ్ల‌రు. ఇక్క‌డ థియేట‌ర్లలో సినిమాలు చూసేందుకు స్థానికులే కాదు విదేశీలు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అంత‌టి పాపులారిటీ మ‌రో థియేట‌ర్ కి లేనేలేదు. ఆ త‌ర్వాత చాలా కాలానికి గ‌చ్చిబౌళిలో మ‌హేష్ ఏఎంబీ సినిమాస్ ని ప్రారంభించ‌డంతో జ‌నాల దృష్టి అటు వైపు మ‌ళ్లింది. మ‌హేష్ మైన‌పు విగ్ర‌హాన్ని సింగ‌పూర్ వాళ్లు ఏఎంబీ ప్రాంగ‌ణంలో ఆవిష్క‌రించ‌డంతో క్రేజు స్కైని ట‌చ్ చేసింది.

అయితే ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ కానీ.. గ‌చ్చిబౌళి ఏఎంబీ సినిమాస్ కానీ ట‌చ్ చేయ‌లేని రేంజులో డార్లింగ్ ప్ర‌భాస్ థియేట‌ర్ `వీఎపిక్` ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. నెల్లూరు సూళ్లూరుపేటలో ప్ర‌భాస్- యువి నిర్మాత‌ల బృందం క‌లిసి నిర్మించిన భారీ థియేట‌ర్ ఇది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద థియేటర్.. ఆసియాలో రెండోది.. .భారత‌దేశంలోనే అతి పెద్దది ఇద‌ని తెలుస్తోంది. 106 అడుగుల వెడల్పు... 54 అడుగుల ఎత్తుతో స్క్రీన్ అబ్బుర‌ప‌రుస్తోంద‌ట‌. ఈ థియేటర్‌లో 650 మంది సిట్టింగ్ కి అనుకూలం అని తెలుస్తోంది.

సాహో రిలీజ్ కి ఒక‌రోజు ముందు అంటే నేడు (గురువారం) వీ- ఎపిక్‌ మల్టీప్లెక్స్ ను మెగా పవర్ స్టార్ రాం చరణ్‌ ప్రారంభించ‌నున్నారు. శుక్రవారం విడుదలవుతున్న‌ సాహోని మొద‌టి ఆట‌గా ఇందులో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. సూళ్లూరు పేట నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని చెన్నై-కోల్‌ కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెం వద్ద ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో వి-సెల్యులాయిడ్ సంస్థ‌ దీనిని నిర్మించింది.