Begin typing your search above and press return to search.

RRR టెన్ష‌న్ తీరాకే CHIRU 152 సెట్స్ కి

By:  Tupaki Desk   |   9 Feb 2020 5:30 PM GMT
RRR టెన్ష‌న్ తీరాకే CHIRU 152 సెట్స్ కి
X
మెగాస్టార్ చిరంజీవి- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ .. ఆ ఇద్ద‌రినీ ఒకే ఫ్రేమ్ లో చూసుకునే అవ‌కాశం కోసం మెగాభిమానులు ఎంత ఆసక్తిగా వేచి చూస్తారో తెలిసిందే. చ‌ర‌ణ్ `మ‌గ‌ధీర‌`లో చిరు అతిథిగా త‌ళుక్కున మెర‌వ‌డ‌మే గాక బంగారు కోడిపెట్ట రీమిక్స్ లోనూ స్టెప్పులేశారు. దానికి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఆ సాంగ్ గురించే ఏళ్ల‌త‌ర‌బ‌డి మెగాభిమానులు చెప్పుకునేవారు. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్‌ బ్రూస్ లీ చిత్రంలో చిరు మ‌రోసారి అతిధిగా క‌నిపించారు.

అయితే ఈసారి కాస్త రివ‌ర్స్. అటు ఇటు అయితే పొర‌పాటు లేదోయ్! అన్న చందంగా.. డాడీ న‌టిస్తున్న ఆచార్య (చిరు 152వ) చిత్రంలో చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సినిమా ఆద్యంతం చ‌ర‌ణ్ క‌నిపించ‌క‌పోయినా .. క‌థాగ‌మ‌నంలో కీల‌క‌మైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చ‌ర‌ణ్ ఏకంగా 25 నిమిషాల షోతో అద‌ర‌గొట్ట‌బోతున్నార‌ట‌. మెగాస్టార్ కి యంగ‌ర్ వెర్ష‌న్ చ‌ర‌ణ్ పై చిత్రీక‌రిస్తారు. అయితే చ‌ర‌ణ్ ఇప్ప‌టికే కొర‌టాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌న్న వార్త‌ల న‌డుమ ఆర్.ఆర్.ఆర్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిలో వేరొక టెన్ష‌న్ మొద‌లైంద‌ని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ పూర్త‌య్యేవ‌ర‌కూ చ‌ర‌ణ్ ఎటూ క‌ద‌ల‌కూడ‌ద‌ని త‌న క‌నుస‌న్న‌ల్లోనే మెల‌గాల‌ని ద‌ర్శ‌క‌ధీర భావిస్తున్నారు. అలాగే చిరు- చ‌ర‌ణ్ - కొర‌టాల సినిమాని ఆర్.ఆర్.ఆర్ రిలీజ‌య్యేవ‌ర‌కూ రిలీజ్ చేయ‌కూడ‌ద‌న్న కండీష‌న్ పెట్టార‌ట‌.

అందుకే జ‌క్క‌న్న‌లో టెన్ష‌న్ ని త‌గ్గించే విధంగా ఎలాంటి ఇబ్బందీ క‌ల‌గ‌కుండా చ‌ర‌ణ్ త‌న కాల్షీట్ల‌ను చిరు సినిమాకి కేటాయించార‌ని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ సాంతం పూర్త‌య్యాకే చ‌ర‌ణ్ కొర‌టాల సినిమా సెట్స్ కి జాయిన్ అయ్యేలా ఒప్పందం కుదిరింద‌ట‌. అందుకే చెర్రీ ఎపిసోడ్ ని చిట్ట‌చివ‌రిలో తెర‌కెక్కించేలా కొర‌టాల ప్లాన్ ని రీడిజైన్ చేశార‌ట‌. తాజా క‌మిట్ మెంట్ తో రాజ‌మౌళికి ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఇదే నిజ‌మైతే ఎవ‌రికీ ఏ అభ్యంత‌రం ఉండ‌దు. త‌న సినిమా ప్ర‌చారంలోనూ భాగ‌మై స‌వ్యంగా రిలీజ‌య్యేవ‌ర‌కూ స్టార్ల స‌పోర్ట్ ను మాత్ర‌మే ఆయ‌న ఆశిస్తున్నారు. దానికి చ‌ర‌ణ్ - తార‌క్ నుంచి కావాల్సినంత కోఆప‌రేష‌న్ ఉంది. 2021 సంక్రాంతి వ‌ర‌కూ హీరోల‌పై ఈ కండీష‌న్లు మాత్రం త‌ప్ప‌ద‌న్న‌మాట‌.