Begin typing your search above and press return to search.
టిక్కెట్ రేటులో `వారియర్` తగ్గేదే లే!
By: Tupaki Desk | 11 July 2022 2:30 AM GMTటాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన `ది వారియర్` జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తెలుగు-తమిళ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి- అక్షర గౌడ ఇందులో కథానాయికలు. రామ్ కెరీర్ బెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతోనే అతడు తమిళ చిత్ర రంగంలో ప్రవేశిస్తున్నారు.
నైజాంలో ఈ మాస్ ఎంటర్ టైనర్ టిక్కెట్ ధరలు ఇటీవల విడుదలైన అనేక భారీ చిత్రాల తరహాలోనే పెద్ద ధరతోనే విక్రయిస్తున్నారు. మల్టీప్లెక్స్ లలో టిక్కెట్ ధర రూ. 295 కాగా సింగిల్ స్క్రీన్ లలో రూ. 175. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రధాన నగరాల్లో టిక్కెట్ ధరలు సింగిల్ స్క్రీన్ లకు రూ. 147 .. మల్టీప్లెక్స్ లలో రూ.177 గా ఉంది. విశాఖ పట్నం జగదాంబ సింగిల్ స్క్రీన్ లో నాన్ ప్రీమియం 100 .. రూ.145 గా ఉంది. స్వల్పంగా హైదరాబాద్ తో పోలిస్తే ధర తక్కువగా ఉంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి- నదియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన బుల్లెట్టు సాంగ్ సహా టీజర్ ట్రైలర్ కి చక్కని స్పందన వచ్చింది. ఇటీవల చెన్నైలో భారీ ఈవెంట్ లో దర్శకులు శంకర్ - మణిరత్నం తదితరులు హీరో రామ్ ని ఆశ్వీర్వదించిన సంగతి తెలిసిందే.
టికెట్ ధరలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలను తగ్గిస్తూ వకీల్ సాబ్ విడుదల సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనంతర పరిణామాలు తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో టికెట్ ధరలు యథావిథిగా మునుపటి ధరలకే కొనసాగుతున్నాయి. దీనిపై ఒక సెక్షన్ లో అసంతృప్తి ఉంది. ప్రస్తుత క్రైసిస్ కాలంలో ప్రజలను థియేటర్లకు రప్పించాలంటే ధరలు అదుపులో ఉండాల్సిందేనన్న చర్చ కూడా సాగుతోంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఇక్కడ ప్రజల్లోనూ కొంత అసంతృప్తి నెలకొంది. పరిమిత ధరలతో ఎక్కువమంది ప్రజలను థియేటర్లకు రప్పించాలని కొందరు కోరుతున్నారు.