Begin typing your search above and press return to search.

ట్వీట్.. ట్వీట్.. సో స్వీట్.. మాజీ ప్రియుడిపై రష్మిక ప్రశంసలు

By:  Tupaki Desk   |   26 Dec 2020 10:15 AM GMT
ట్వీట్.. ట్వీట్.. సో స్వీట్.. మాజీ ప్రియుడిపై రష్మిక ప్రశంసలు
X
‘రష్మిక మందన్న..’ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కన్నడ మూవీ ‘కిరిక్ పార్టీ’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అప్పుడు 20 సంవత్సరాల వయసున్న రష్మిక.. తన తొలి సినీ నటుడు, రచయిత, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది.

సినిమా విడుదలైన తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఈ లవ్‌బర్డ్స్ పెళ్లి కాకుండానే విడిపోయారు. ఆ తర్వాత రష్మిక, రక్షిత్ ఇద్దరూ దూరంగానే ఉన్నారు. ఇంటర్వ్యూలలోనూ ఒకరి గురించి ఒకరు మాట్లాడటం మానేశారు. అయితే.. ఇటీవల ఈ సిచుయేషన్ ను బ్రేక్ చేసింది రష్మిక.

తన ‘కిరిక్ పార్టీ’కి చెందిన పాట ‘గురువరం సయంకం’ యూట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ ట్విటర్ లో ఓ పోస్ట్ పెట్టింది రష్మిక. ఈ ట్వీట్ కు తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టిని కూడా ట్యాగ్ చేసింది. ఈ ట్వీట్ కు రక్షిత్ కూడా రిప్లే ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. “గ్రో గ్రో గ్రో గర్ల్.. మే యువర్ ఆల్ డ్రీమ్స్ కమ్ ట్రూ’’ అని రక్షిత్ రిప్లే ఇచ్చాడు.

రష్మిక తన ట్వీట్‌లో మాజీ ప్రియుడి పేరును ట్యాగ్ చేయడం.. దానికి అతను స్పందిస్తూ ‘నీ కలలన్నీ నిజమవ్వాలి’ అంటూ రీ ట్వీట్ చేయడం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. కాగా.. రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. త్వరలో కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా ప్రవేశించబోతోంది.