Begin typing your search above and press return to search.

వాటితో నాకేం ఇబ్బంది లేదు ఆస్వాదిస్తాను!

By:  Tupaki Desk   |   20 Feb 2020 12:39 PM GMT
వాటితో నాకేం ఇబ్బంది లేదు ఆస్వాదిస్తాను!
X
సెలబ్రెటీలు అన్నప్పుడు సోషల్‌ మీడియాలో పుకార్లు.. ట్రోల్స్‌.. విమర్శ చాలా కామన్‌ గా ఉంటాయి. ఎంత కాదనుకున్నా కూడా వాటిని తట్టుకోవాల్సిందే. ట్రోల్స్‌ కు వ్యతిరేకంగా మాట్లాడితే మరింత ట్రోల్‌ అవ్వాల్సి వస్తుంది. కనుక ఆ ట్రోల్స్‌ ను చాలా మంది పట్టించుకోరు.. కొంత మంది ఆ ట్రోల్స్‌ ను ఎంజాయ్‌ చేస్తూ ఉంటామని చెబుతుంటారు. వారి అసలు ఫీలింగ్‌ ఏంటీ అనేది మాత్రం ఎవరికి తెలియదు.

రష్మిక మందన్న పై కూడా కెరీర్‌ ఆరంభం నుండి ఏదో ఒక ట్రోల్‌ వస్తూనే ఉంటేది. సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల తర్వాత ఈ అమ్మడిపై ట్రోల్స్‌ మరింతగా పెరిగాయి. సినిమాలో నీవు చేసింది యాక్టింగ్‌ అనుకుంటే పొరపాటు.. అది ఓవర్‌ యాక్టింగ్‌ అంటూ పలువురు ట్రోల్స్‌ చేశారు. అమ్మడిని ట్రోల్స్‌ చేస్తున్న నెటిజన్స్‌ ఆమెను గతంలో వ్యక్తిగతంగా కూడా ట్రోల్‌ చేసిన దాఖలాలు ఉన్నాయి.

తాజాగా తనపై వచ్చే ట్రోల్స్‌ పై స్పందించిన రష్మిక వాటిని ఎంజాయ్‌ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. నా కెరీర్‌ ఆరంభం నుండి ట్రోల్స్‌ చూస్తూనే ఉన్నాను. నేను ఈ స్థాయికి రావడానికి అవి కూడా ఒక కారణంగా నేను భావిస్తాను. అందుకే నేను వాటికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఎంజాయ్‌ చేస్తానంటూ ఆశ్చర్యకరంగా చెప్పుకొచ్చింది.

రష్మిక రేపు నితిన్‌ తో నటించిన భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాతో పాటు ఇంకా పలు తెలుగు మరియు తమిళ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కన్నడంలో కూడా ఈ అమ్మడు నటిస్తూనే ఉంది. మొత్తానికి మూడు భాషల్లో బిజీ స్టార్‌ గా ఈ అమ్మడు కెరీర్‌ లో దూసుకు పోతుంది.