Begin typing your search above and press return to search.
నాలుగో సారి మాస్ రాజా పోలీస్ రోల్
By: Tupaki Desk | 29 Sep 2019 7:32 AM GMTమాస్ మహారాజా రవితేజ ఇప్పటివరకూ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ చేసిన రోల్ ఏది? అంటే .. విక్రమార్కుడు చిత్రంలోని విక్రమ్ సింగ్ రాధోడ్ పాత్రను గుర్తు చేయాల్సిందే. కామెడీలు చేసే రవితేజలో అంత పవర్ ఎనర్జీ ఉన్నాయని ఆ పోలీస్ అధికారి పాత్ర వల్లనే తెలిసింది. మాస్ మహారాజ్ లోని ఈ కొత్త యాంగిల్ ని కనిపెట్టింది ఎస్.ఎస్.రాజమౌళి. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా రవితేజ నటన రికార్డు పుటల్లో నిలిచి పోయింది.
అయితే ఆ తర్వాత పవర్- టచ్ చేసి చూడు చిత్రాల్లో పోలీస్ అధికారిగా నటించినా అవేవీ ఎందుకనో వర్కవుట్ కాలేదు. అయితే నాలుగోసారి రవితేజ పోలీస్ అధికారిగా నటించబోతున్నారని తెలుస్తోంది. అది కూడా తన ఫేవరెట్ డాన్ శీను డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా అనే చిత్రంలో నటిస్తున్న రవితేజ తర్వాత గోపిచంద్ మలినేనితో సెట్స్ కెళతారట. అందులో పోలీస్ అధికారి పాత్రలో నటిస్తారని చెబుతున్నారు. అయితే మాస్ రాజాని ఆ రేంజులో పవర్ ఫుల్ గా చూపిస్తారా? లేక ఆ పాత్ర పరమార్థం ఎలా ఉండబోతోంది అనేది మలినేని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇంతకుముందులా రొటీన్ మాస్ పాత్రలు... రొటీన్ పోలీస్ పాత్రలతో మెప్పించే సన్నివేశం కనిపించడం లేదు. స్క్రీన్ ప్లే పరంగా లాజిక్స్.. కొత్తదనం చూస్తున్నారు జనం. అందుకే గోపిచంద్ మలినేని ఎలాంటి కథ రాసుకున్నాడు? అన్నది వేచి చూడాల్సిందే. డిస్కోరాజా చిత్రీకరణ పూర్తవ్వగానే రవితేజ-మలినేని స్క్రిప్టుపై కసరత్తు జరుగుతుందట.