Begin typing your search above and press return to search.

థియేట‌ర్స్ ఊపందుకుంటే ఆ రెండు సినిమాల విడుద‌ల కష్టమేనా..?

By:  Tupaki Desk   |   5 Nov 2020 11:30 PM GMT
థియేట‌ర్స్ ఊపందుకుంటే ఆ రెండు సినిమాల విడుద‌ల కష్టమేనా..?
X
కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమాల విడుదల ఆగిపోయింది. థియేటర్స్ మూతబడి ఉండటంతో అప్పటికే పూర్తయిన సినిమాలు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్న సినిమాలు ఆల్టర్నేట్ గా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలలో విడుదల అయ్యాయి. అయితే లాక్ డౌన్ కి ముందే కంప్లీటై రిలీజ్ కి రెడీ గా ఉన్న '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?' 'ఉప్పెన' వంటి సినిమాలు మాత్రం ఇంకా విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా కూడా ఈ కోవకే చెందినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం డిసెంబ‌ర్ 20న విడుదల కానుందని తెలుస్తోంది. ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ లేదా డిజిటల్ రిలీజ్ అనే దానిపై డైలామాలో ఉన్న మేకర్స్ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారు.

యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్ వీ బాబు నిర్మించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ లాక్ డౌన్ వల్ల కుదరలేదు. మరోవైపు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా 'ఉప్పెన'. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాని కూడా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాల విడుదల గురించి ఎలాంటి న్యూస్ లేదు. ఇన్నాళ్లూ థియేటర్స్ క్లోజ్ అవడంతో సైలెంటుగా ఉన్న టీమ్.. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తున్నా కూడా సైలెంట్ గానే ఉంటున్నారు. ఈ రెండు సినిమాల నుంచి అప్పుడెప్పుడో రెండు పాటలు త‌ప్ప ఇంకేం విడుద‌ల చేయలేదు.

థియేటర్స్ ఎప్పటిలాగే రన్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమాల విడుదల గురించి ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం ఏంటంటే.. ఒకవేళ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో మళ్లీ థియేట‌ర్స్ ఊపందుకుంటే ఆ త‌రువాత పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కి క్యూ క‌డ‌తాయి. అప్పుడు మిగతా సినిమాలకు థియేటర్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఇన్నాళ్లు వెయిట్ చేసినవాళ్లు మళ్ళీ ఓటీటీ వైపు వెళ్లే అవకాశం లేదు. ఈ లెక్క‌న చూసుకుంటే '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?' 'ఉప్పెన' సినిమాలు వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కి కూడా విడుద‌లవ్వ‌డం కష్టమే అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే ఈ రెండు సినిమాల అప్డేట్స్ ఇచ్చి రిలీజ్ విషయంలో అందరికీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.