Begin typing your search above and press return to search.

అందుకే తాను అడల్ట్ స్టార్ గా మారనని చెబుతున్న మహిళా రేసర్

By:  Tupaki Desk   |   9 Jun 2020 5:45 AM GMT
అందుకే తాను అడల్ట్ స్టార్ గా మారనని చెబుతున్న మహిళా రేసర్
X
స్పోర్ట్స్ మీద ఆసక్తి అన్నంతనే చాలామంది క్రికెట్. లేదంటే.. పుట్ బాల్.. ఇంకా కాదంటే టెన్నిస్.. హాకీ లాంటి క్రీడలు చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందే క్రీడల్లో రేసింగ్ ఒకటి. ప్రమాదపు అంచుల్లో ఆడే రేసింగ్ క్రీడలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒక మాజీ రేసర్ ఇప్పుడు అడల్ట్ స్టార్ గా వెలిగిపోతోంది ఆస్ట్రేలియాకు చెందిన రెనీ గ్రేసీ.

చూపు తిప్పుకోలేనంత అందం.. అంతకు మించిన ఆకర్షణ సొంతమైన ఆమె రేసింగ్ నుంచి ఎందుకు తప్పుకున్నట్లు? తన ప్రొఫెషన్ కు ఏ మాత్రం సంబంధం లేని అడల్ట్ ఇండస్ట్రీ కి ఎలా వచ్చిందన్న ప్రశ్నలకు ఆమె సమాధానాల్ని చెప్పుకొచ్చారు. సూపర్ కార్స్ రేసర్ గా పేరు తెచ్చుకుంటున్న వేళలో.. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 2017లో ఆమె వెనుకపడి పోవటమే కాదు.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీంతో.. ఆమె కెరీర్ ను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. చివరకు బతుకుదెరువు కోసం ఒక కారు యార్డులో పని చేయాల్సిన దుస్థితి. అలాంటి సమయంలో ఆమె కంటికి ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్ సైట్ చూసింది. దాంతో ఆమెకు తానేం చేయాలన్న విషయం అర్థమైనట్లు చెబుతుంది. తన న్యూడ్ ఫోటోలతో పాటు.. వీడియోల్ని ఆ వెబ్ సైట్ కు పోస్టు చేయటం.. తొలివారంలోనే రెండున్నర లక్షల రూపాయిల సంపాదనను సొంతం చేసుకుంది. దీంతో.. అడల్ట్ స్టార్ గా మారిపోయింది.

తన జీవితంలో చేసిన మంచి పని ఏమైనా ఉందంటే.. అది తాను అడల్ట్ స్టార్ గా మారటమేనని రెనీ చెప్పే మాటలు అస్సలు మింగుడు పడవు. కానీ.. ఆమె వాదనను వింటే మాత్రం కన్వీన్స్ కావటం ఖాయం. తాను అడల్ట్ స్టార్ గా మారిన తర్వాత 30 ఏళ్లలో తీర్చే ఇంటి రుణాన్ని ఏడాదిలోనే తీర్చేశానని.. అంతకు మించి తనకు కావాల్సిందేముందంటూ రెనీ గ్రేసీ చెబుతోంది. ఎవరి వాదన వారిది. కానీ.. ఒక మంచి రేసర్ ఆర్థిక ఇబ్బందులతో అడల్ట్ స్టార్ గా మారటం బాధ కలిగించే అంశమే.