Begin typing your search above and press return to search.

మీడియా చెప్పే వరకు బికినీ ఉందన్న విషయం ఆమెకు తెలీదట

By:  Tupaki Desk   |   29 Aug 2021 8:40 AM GMT
మీడియా చెప్పే వరకు బికినీ ఉందన్న విషయం ఆమెకు తెలీదట
X
తెలుగు సీరియల్స్ మాత్రమే ఫాలో అయ్యే వారికి 'అనుపమ' అంటే అర్థం కావటం కష్టమే. తెలుగుతో పాటు హిందీ సీరియల్స్ ను ఫాలో అయ్యే వారికి ఆమె చాలా చాలా సుపరిచతం. హిందీ రాకున్నా.. సర్దుకుపోతూ చూసే తెలుగు వారితో పాటు.. హిందీ.. తెలుగు సీరియల్స్ ను ఎంజాయ్ చేసేటోళ్లు తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ బోలెడంతమంది ఉన్నారు. అలాంటి వారికి స్టార్ ప్లస్ లో టెలికాస్ట్ అయ్యే 'అనుపమ' ధారావాహిక సుపరిచితం. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ షురూ చేసిన ఆమె పలు సీరియళ్లలో నటించారు రూపాలి గంగూలీ. అయితే.. ఆమె చేస్తున్న 'అనుమప' సీరియల్ ఆమె ఇమేజ్ ను మరింత పెంచటమే కాదు.. కోట్లాది మందికి దగ్గర చేసింది.

బిగ్ బాస్ సీజన్ 2006లో కంటెస్టెంట్ గా సుపరిచితమైన ఆమెకు ఇన్ స్టాలో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారటం.. దానికి ఆధారంగా ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన ఫోటోనే కారణంగా కావటం గమనార్హం. హోమ్లీగా ఉంటూ.. ఇంట్లో వదినలా కనిపించే అనుపమ తాజాగా స్విమ్మింగ్ ఫూల్ లో తన కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఆ పిక్ చూసినంతనే.. బికినీ ధరించి ఉంటారన్న భావన కలిగేలా ఉంది.

ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా వ్యవహరించే సోషల్ మీడియాలోనూ.. ఇప్పటి మీడియాలో కొందరు అనుపమ పోస్టును తమ ఊహకు తోచినట్లుగా రాసేశారు. భర్త.. కొడుకుతో కలిసి లోనావాలాకు వెళ్లిన ఆమె.. స్విమ్మింగ్ పూల్ దగ్గరి ఫోటోను చూపిస్తూ.. బికినీలో రూపాలి అంటూ తమకు తోచిన వ్యాఖ్యానంతో వార్తలు రాసేశారు. దీంతో.. ఆగ్రహానికి గురైన రూపాలీ అందుకు కౌంటర్ ఇచ్చారు.

అరే.. నా దగ్గర బికినీ ఉందని నాకే తెలియదు.. నాకంటే నా గురించి మీకే ఎక్కువగా తెలుసు.. రాంగ్ రిపోర్టు అంటూ ఎటకారం ఆడేశారు. అంతేకాదు.. ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాయటం సరికాదని మండిపడ్డారు. ఆమె తాజా వ్యాఖ్యలకు కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అయితే.. మరికొందరు మాత్రం నెగిటివ్ గా స్పందించారు. ఆమె షేర్ చేసిన ఫోటోలో మెడ కింద భాగం.. భుజాల పై భాగం వరకే పిక్ ఉండటం.. అందులో ఉన్న స్ట్రిప్ చూసినంతనే బికినీ భావన కలుగజేసేలా ఉందంటున్నారు. అయినా.. సరదాగా ఫ్యామిలీతో కలిసి వెళ్లినప్పుడు.. కాంట్రావర్సీగా ఉండే ఫోటోలు పోస్టు చేయకుండా.. ఎప్పటిలానే హోమ్లీ ఫోటోలు పోస్టు చేస్తే.. ఈ రచ్చే ఉండేది కాదు కదా?