Begin typing your search above and press return to search.

నిన్న ఆస్కార్ అవార్డు సినిమాపై.. ఈరోజు ఆస్కార్ అవార్డుపై...!

By:  Tupaki Desk   |   24 April 2020 11:24 AM GMT
నిన్న ఆస్కార్ అవార్డు సినిమాపై.. ఈరోజు ఆస్కార్ అవార్డుపై...!
X
'బాహుబలి' సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. టాలీవుడ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసిన రాజమౌళిపై ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'పారసైట్' గురించి రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. 'ప్యారాసైట్' సినిమా ఎందుకో అంతగా నచ్చలేదని.. ఫిల్మ్ చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించింది.. సినిమా సగం చూసాక నిద్ర పోయా అని రాజమౌళి కామెంట్ చేసాడు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏ సినిమాను అయినా మొత్తం చూశాకే కామెంట్ చేయాలని దర్శక ధీరుడిని నెటిజన్స్ విమర్శించారు. టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి ఆస్కార్ అవార్డు సాధించిన సినిమా గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని సూచించారు. ఇప్పుడు తాజాగా ఏకంగా ఆస్కార్ అవార్డుల‌పై మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశాడట రాజ‌మౌళి.

'పార‌సైట్' న‌చ్చ‌క‌పోవ‌డ‌మ‌నేది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయం.. అయినా ఆస్కార్ జ్యూరీలో కూడా లాబీయింగ్ జరుగుతుందని.. ఓ సినిమా జ్యూరీ స‌భ్యులు చూడాలంటే చాలా త‌తంగ‌మే న‌డుస్తుందని.. అయినా స‌రే జ్యూరీ ప్ర‌మాణాల్ని పాటిస్తుంటుంద‌ని ప్ర‌పంచం మొత్తం న‌మ్ముతుంద‌ని.. ఓ చెత్త సినిమాకు అవార్డు ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని, గ‌తంలోనూ ఆస్కార్ సాధించిన చాలా సినిమాలు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడట రాజ‌మౌళి. ఇంతకముందు ఆస్కార్ అవార్డు సినిమాపై కామెంట్ చేసిన జక్కన్న ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డుపైనే కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు రాజమౌళిని సమర్థిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఆస్కార్‌పైనే కాదు.. ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమాల‌న్నింటిపైనా ఇలాంటి విమ‌ర్శ‌లు అభిప్రాయాలే వ్య‌క్తం అవుతుంటాయి. అవార్డు సినిమా అంటే బోరింగ్ సినిమానే అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. మరి జక్కన్న చేసిన కామెంట్స్ ఎక్కడి దాకా దారితీస్తాయో చూడాలి.