Begin typing your search above and press return to search.

#సామ్ లో ఈ యాంగిల్ కి నెవ్వ‌ర్ బిఫోర్ విజిల్సే!

By:  Tupaki Desk   |   23 Sep 2020 5:45 AM GMT
#సామ్ లో ఈ యాంగిల్ కి నెవ్వ‌ర్ బిఫోర్ విజిల్సే!
X
పెరుగుతున్న అధునాత‌న టెక్నాల‌జీని పూర్తిగా ఉప‌యోగించుకుంటూ అర్హులైన నిపుణుల నుండి నిర్ధిష్ట‌మైన స‌మాచారాన్ని అందుకోవ‌డం ద్వారా ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న శైలి అంశాల‌ను ఎంచుకునే అవ‌కాశాన్ని కల్పించి ప్ర‌జ‌లు త‌మ జీవితాల‌ను ప‌రిపూర్ణంగా ఆరోగ్యక‌రంగా సాగించేలా స్ఫూర్తిని అందించాల‌నే ల‌క్ష్యంతో మెగా కోడ‌లు హెల్త్ వెబ్ పోర్ట‌ల్ యుఆర్‌ లైఫ్ ని ప్రారంభించింది. దీనికి అతిథి సంపాద‌కురాలిగా స‌మంత‌ను నియ‌మిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది.

ఇదే స‌మ‌యంలో తాజా ఫోటోషూట్ లో స‌మంత మ‌రింత హాట్ ‌గా క‌నిపించిన విష‌యం తెలిసిందే. బ్లాక్ స్పోర్ట్స్ డ్రెస్ బ్లాక్ ట్రాక్ సూట్ పై యాష్ క‌ల‌ర్ జర్కిన్ ధ‌రించి సామ్ హొయ‌లు పోయింది. అంతేనా యాష్ క‌ల‌ర్ జ‌ర్కీని తొల‌గించి బ్లాక్ స్పోర్ట్స్ బ్రాలో సామ్ వ‌ర్క‌వుట్ల‌ను చేస్తూ హంగామా చేసింది. సామ్ వ‌ర్క‌వుట్ కంటే ఆమె అందాల షో పైనే ఎక్కువ‌గా నెటిజనుల కామెంట్లు ప‌డిపోతున్నాయ్‌.

జిమ్ లో హెవీ వెయిట్ లిప్టింగ్ తో పాటు 10 కెజీ పౌండ్స్ డంబెల్ ‌తో సామ్ చేసిన విన్యాసం ఇప్పుడు వైర‌ల్ ‌గా మారింది. స‌న్నజాజి న‌డుముని బెండ్ చేసి సామ్ చేసిన వ‌ర్క‌వుట్స్ కి నెటిజనం ఫిదా అయిపోతున్నారు. హెల్త్ టిప్స్ ఏమోగానీ ఈ భంగిమ‌లో సామ్ అందానికి ఫ్లాటైపోతున్నారు.