Begin typing your search above and press return to search.

మామ‌పైనే సెటైర్ లా ఏంటిది సామ్?

By:  Tupaki Desk   |   28 April 2019 4:31 PM GMT
మామ‌పైనే సెటైర్ లా ఏంటిది సామ్?
X
ఒకే కాంపౌండ్ లో ఒక‌రికి మించి ఎక్కువ మంది స్టార్లు ఉంటే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు రూపొందించే వాళ్ల‌కు కాస్తంత క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప‌దేమో! పైగా ఒకే త‌ర‌హా బ్రాండ్స్ కి ఒకే కుటుంబం నుంచి స్టార్ల‌ను ఎంపిక చేసుకుని యాడ్స్ రూపొందించాల్సి వ‌స్తే ఆ సంద‌ర్భ ంలో స‌మీక్షించుకుని మినిమం జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యే ప్ర‌మాదం ఉంటుంద‌ని తాజాగా ఓ ప‌రిణామం ప్రూవ్ చేసింది. ఆ వాణిజ్య ప్ర‌క‌ట‌న రూపొందించిన యాడ్ డైరెక్ట‌ర్ చేసిన ప‌నికి ఏకంగా మామ‌పైనే కోడ‌లు పంచ్ వేసి దొరికిపోవాల్సొచ్చింది. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో మామ ఎవ‌రు.. కోడ‌లు ఎవ‌రు? అంటే ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. నాగార్జున మామ‌పై కోడ‌లు స‌మంత ఓ వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌లో అదిరిపోయే పంచ్ వేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అయితే అది తెలిసి జ‌రిగిన పొర‌పాటా లేక తెలియ‌క జ‌రిగినదా? అన్న‌ది అటుంచితే అస‌లేం జ‌రిగింది? అన్న‌ది చూస్తే ఆస‌క్తిక‌రం. మామ కోడ‌ళ్లు ఇద్ద‌రూ డిట‌ర్జెంట్ ప్ర‌క‌ట‌న‌ల‌కు పెట్టింది పేరు అన్న‌ సంగ‌తి తెలిసిందే. చాలా కాలంగా `ఘడి` అనే డిటర్జెంట్ బ్రాండుకు కింగ్ నాగార్జున‌ ప్రచారం చేస్తున్నారు. అందులో ఆయన డైలాగులు అభిమానులు మ‌ర్చిపోలేరు.`వాడి చూడండి. తర్వాతే నమ్మండి` అంటూ కింగ్ ఘ‌డి డిట‌ర్జెంట్ గొప్ప‌త‌నాన్ని చెప్పారు. దీనికి కౌంట‌రా అన్న‌ట్టు సామ్ తాజా డిట‌ర్జెంట్ యాడ్ పెద్ద షాక్ నే ఇచ్చింది. ట్రిపులెక్స్ డిట‌ర్జెంట్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న సామ్ .. ఈ ప్ర‌క‌ట‌న‌లో ప‌లికే ఓ డైలాగ్ ఫ్యాన్స్ ని హ‌ర్ట్ చేసిందిట‌. 30 ఏళ్లుగా వినియోగంలో ఉన్న డిట‌ర్జెంట్ ఇది. ``స్వయంగా మీరే టెస్ట్ చేసి చూశారుగా.. మరి ల్యాబుల్లో టెస్టులెందుకు? వాడి చూడండని చెప్పడమెందుకు?`` అంటూ అదిరే పంచ్ నే వేసింది సామ్‌. ఈ పంచ్ కాంపిటీటివ్ డిట‌ర్జెంట్ పైనేనా.. లేక మామ పైనా అన్న‌ది సామ్ నే చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం ఈ త‌ప్పిదంపై అక్కినేని అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తెలిసి చేసినదా .. లేక యాథృచ్ఛికంగా దొరికిపోయారా? అన్న‌ది కాస్తంత త‌ర‌చి చూడాలి. అయితే త‌న‌పై కోడ‌లు వేసిన పంచ్ ని మామ స్పోర్టివ్ గా భావించి లైట్ తీస్కున్నా కింగ్ వీర‌ ఫ్యాన్స్ మాత్రం గ‌రంగ‌రంగానే ఉన్నారు.

గ‌తంలో ఇదే త‌ర‌హాలో ఒకే ఫ్యామిలీ హీరోలు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించిన సంద‌ర్భ ం ఉంది. నాగార్జున గుడ్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి థ‌మ్స‌ప్ కి.. ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పెప్సీకి.. కాంపిటీటివ్ కోలా బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేసి షాకిచ్చారు. అయితే అప్ప‌ట్లో ఆ ప్ర‌క‌ట‌న‌ల్లో ఎక్క‌డా ఒక‌రిపై ఒక‌రు పంచ్ లు వేసుకున్న‌ది లేదు. స‌ల్మాన్ - షారూక్ విష‌యంలోనూ కోలా ప్ర‌క‌ట‌న‌ల్లో మాత్రం ఒక‌రిపై ఒక‌రు పంచ్ లు వేసుకున్న సంద‌ర్భ ం ఉంది. అయితే ఈ ఇద్ద‌రూ ఒకే ఫ్యామిలీ కాదు కాబ‌ట్టి ఫ్యాన్స్ లో అంత స‌మ‌స్యేం లేదు.