Begin typing your search above and press return to search.

రౌడీ కొండ అంటే పడి చ‌స్తోంది!

By:  Tupaki Desk   |   23 Dec 2021 12:30 AM GMT
రౌడీ కొండ అంటే పడి చ‌స్తోంది!
X
లైగ‌ర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టికే అత‌డికి సౌతిండియాతో పాటు ఉత్త‌రాదినా భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. సోష‌ల్ మీడియాల్లోనూ అత‌డిని అనుస‌రించేవారి సంఖ్య అసాధార‌ణంగా ఉంది. గాళ్ ఫాలోయింగ్ అయితే మైండ్ బ్లాక్ చేస్తోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల జాబితాలో జాన్వీ క‌పూర్.. సారా అలీఖాన్.. అన‌న్య పాండే.. కియ‌రా అద్వాణీ లాంటి టాప్ బ్యూటీస్ ఉన్నారు. దేవ‌రకొండ స‌ర‌స‌న న‌టించేందుకు స‌ద‌రు భామామ‌ణులు ఉవ్విళ్లూరుతున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఇంత‌కుముందు కాఫీ విత్ క‌ర‌ణ్ కార్య‌క్ర‌మంలో యువ‌నాయిక‌లు సారా అలీఖాన్ .. జాన్వీ త‌మ‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే క్ర‌ష్ అని కూడా చెప్పారు. అత‌డితో న‌టించానుంద‌ని ఓపెన్ అయిన సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా బాలీవుడ్ భామ‌ల మ‌ల‌సులు కొల్ల‌గొట్ట‌డంలో విజ‌య్ ఇత‌ర సౌత్ హీరోల‌తో పోలిస్తే చాలా ముందున్నాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌న‌దైన స్టైల్ యూనిక్ నెస్ తో అతడు యువ‌నాయిక‌ల గుండెల్లో తిష్ఠ వేశాడు. తాజాగా సారా అలీఖాన్ మ‌రోసారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై అభిమానాన్ని దాచుకోలేక‌పోయింది.

స‌ద‌రు బ్యూటీ స్వయంవర్ కోసం సిద్ధంగా ఉంది. గ‌తంలో విజయ్ దేవరకొండపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న సారా అలీఖాన్ మళ్లీ తన స్వయంవరం కోసం అతడిని ఎంపిక చేసింది. కరణ్ జోహార్ షోలో పాల్గొన్న సారా తన స్వయంవరంలో ఏ హీరోల్ని కలిగి ఉండాలనుకుంటున్నారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. సారా తన స్వయంవరంలో రణవీర్ సింగ్ - వరుణ్ ధావన్ - విక్కీ కౌశల్ - విజయ్ దేవరకొండలను కోరుకుంది.

సద‌రు హీరోలంతా పెళ్ల‌యిన వారే. వారి భార్యలందరూ లైవ్ లో కార్య‌క్ర‌మం చూస్తున్నారని ఉల్లాసంగా అన‌గానే దానికి సారా కూడా అంతే ఛ‌మత్కారంగా రిప్ల‌య్ ఇచ్చింది. ``భర్తలు కూడా ఉంటారని ఆశిస్తున్నాను`` అని అంది. అయితే ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మాత్ర‌మే భార్య‌తో స‌మ‌స్య లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కాబ‌ట్టి త‌న‌ను స్వ‌యం వ‌రంలో సారా వ‌రిస్తే త‌ప్పేమీ కాద‌నేది అంద‌రి అభిప్రాయం.

అయినా ప‌టౌడీ సంస్థానంలో అంద‌గ‌త్తె మ‌న రౌడీ కొండ‌ను వ‌రించ‌డం అంటే అది నిజంగా ఎంతో గొప్ప విష‌యం. అత‌డికి ఆ ఛ‌రిష్మా ఉంది. ప్ర‌తిభ‌కు కొద‌వే లేదు. ప్ర‌స్తుతం లైగ‌ర్ తో పాన్ ఇండియా స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకుంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ మునుముందు సారా స్వ‌యం వ‌రంపై ఏమ‌ని స్పందిస్తారో చూడాలి. అత‌డు త‌న‌ని తాను పెద్ద బాలీవుడ్ స్టార్ గా ఎలివేట్ చేసుకునేందుకు ఈ స్నేహాలు ప్రేమ‌లు ప‌రిచ‌యాలు పెద్ద‌గా ఉప‌క‌రిస్తాయ‌నే అభిమానులు భావిస్తున్నారు.

దేవరకొండ హాట్ గా ఉంటాడ‌ని అతనితో సెల్ఫీ దిగిన‌ సారా త‌న‌తో కలిసి న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నాన‌ని..త‌న‌ని ఇష్టపడతానని సారా చెప్పింది. లైగ‌ర్ 2022 ఆగ‌స్టులో విడుద‌ల‌వుతోంది. అప్ప‌టికి హిందీ ప్ర‌మోష‌న్స్ లో సారాను మ‌రోసారి క‌లిసేందుకు వీలుంటుందేమో!