Begin typing your search above and press return to search.
సైబర్ క్రైమ్ సెల్ కి సర్కార్ వారి ఫిర్యాదు!
By: Tupaki Desk | 9 Aug 2021 12:30 PM GMTనేడు సూపర్ స్టార్ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా `సర్కారు వారి పాట` బ్లాస్టర్ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆన్ లైన్ లో టీజర్ రిలీజ్ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని సర్కారు వారి టీమ్ గ్రాండ్ గా ప్లాన్ చేసింది. మహేష్ సైతం ఎంతో ఎగ్జైట్ గా ఎదురుచూసారు. అయితే అందరి ఎగ్జైట్ మెంట్ పై లీకు దొంగలు నీళ్లు చల్లేసారు. ముహూర్తానికి ముందే టీజర్ లీకై షాక్ లిచ్చింది.
సర్కారు వారి టీమ్ అనుకున్న టైమ్ లో కాకుండా.. అంటే తొమ్మది గంటలు ముందుగానే లీక్ దొంగలు ఆన్ లైన్ లో బ్లాస్టర్ లీక్ చేసి షాకిచ్చారు. దీంతో మహేష్ సహా టీమ్ అంతా ఖంగుతున్నారు. దీంతో మేకర్స్ హుటా హుటిన అర్ధరాత్రి పూటనే టీజర్ ని అధికారికంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. సడెన్ గా ఈ ట్విస్ట్ ఏంటని ఆశ్చర్యపోయారు.
ఇలాంటి అర్ధంతర రిలీజ్ వల్ల టీజర్ కి రీచబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అభిమానులు సహా ప్రేక్షకులు ఎవ్వరికి ఈ విషయం తెలియకపోవడం బ్లాస్టర్ కి నెగిటివ్ వైబ్ లా కనిపిస్తుంది. ప్రస్తుతం లైక్ లు..షేర్ లంటూ అభిమానులు చేసే హడావుడిపైనే సినిమా బజ్ ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా సర్కారు వారికి ఆదిలోనే గట్టి షాక్ తగిలినట్లైంది. ప్రస్తుతం యూనిట్ లీక్ ఎలా జరిగిందన్న దానిపై సీరియస్ గా అన్వేషణ చేస్తున్నట్లు తెలిసింది. దొంగలెవరో కనిపెట్టి సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇచ్చి పట్టించాలని నిర్మాతలు ఆలోచనలో ఉన్నారు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో కథానాయిక. మహేష్ మాస్ లుక్ తో పాటు క్లాస్ లుక్ లోనూ టీజర్ ఆద్యంతం సర్ ప్రైజ్ లిచ్చిన సంగతి తెలిసినదే.