Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: రెండు చేతులు పైకెత్తి.. కసరత్తు!

By:  Tupaki Desk   |   27 Feb 2020 4:38 PM GMT
ఫోటో స్టోరీ: రెండు చేతులు పైకెత్తి.. కసరత్తు!
X
తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం చేయాల్సిన అవసరమే లేని పేరు శ్రియ శరణ్. తెలుగు మాత్రమే కాదు.. అన్నీ సౌత్ భాషల్లో నటించింది. హిందీ సినిమాలు కూడా చేసి సామాజిక న్యాయం పాటించింది. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అయింది కాబట్టి స్టార్ హీరోల సినిమా ఆఫర్లు లేవు. ఏవో ఒకటి ఆరా ఆఫర్లు మాత్రం ఉన్నాయి. కొంతకాలం క్రితం రష్యన్ బాయ్ ఫ్రెండును వివాహం చేసుకుని శ్రీమతిగా మారిపోయింది. శ్రీమతిగా మారినప్పటికీ సోషల్ మీడియాలో నెటిజన్లను టార్చర్ చెయ్యడం మాత్రం మానడం లేదు.

హాట్ ఫోటోషూట్లలో పాల్గొనడం.. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చెయ్యడం.. వాటితో హీటు పెంచడం అనేది సాధారణ విషయం. శ్రియ మొదటి నుంచి ఫిట్నెస్ ఫ్రీక్. రోజూ ఎక్సర్ సైజులు చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ తన ఒక్క గ్రాము కూడా అదనపు ఫ్యాట్ ఒంట్లో చేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. జిమ్ కు పోవడం అనేది తప్పనిసరి. అయితే జిమ్ లో ఎక్సర్ సైజ్ చేసే ఫోటోలు మాత్రం ఎందుకో పెద్దగా బయటకు రావు. అందుకే ఈమధ్య శ్రియ అభిమానులు గూగుల్ లో శోధన చేసి మరీ శ్రియ కసరత్తులు చేసే ఒక ఫోటోలు బయటకు తీసి ఆ ఫోటోను వైరల్ చేసే పనిలో పడ్డారు.

ఈ ఫోటోలో ఒక స్లీవ్ లెస్ టీ షర్టు ధరించి రెండో చేతులు పైకెత్తి షోల్డర్ ఎక్సర్ సైజులు చేస్తూ ఉంది. ఈ రేంజ్ లో ఎక్సర్ సైజులు చేస్తుంది కాబట్టే శ్రియ అంత ఫిట్టుగా ఉంది. ఆ ఎల్లో టీ షర్టు కూడా చాలా అందంగా ఉంది. ఈ ఫోటోలో శ్రియ ను చూసినవారు ఎవరైనా ఇరవైలలో ఉందని అనుకుంటారు కానీ నలభైల దగ్గరలో ఉండి చచ్చినా అనుకోరు. ఫార్టీస్ లో ట్వంటీస్ ను చూపించడం అందరికీ వీలుకాదు. అది శ్రియ లాంటివారికి మాత్రమే సొంతం. ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే తమిళ చిత్రం 'సండకారి'లో నటిస్తోంది.