Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ వెడ్డింగ్ లుక్.. అదుర్స్!!

By:  Tupaki Desk   |   29 July 2020 3:30 AM GMT
స్టార్ హీరోయిన్ వెడ్డింగ్ లుక్.. అదుర్స్!!
X
ప్రస్తుతం కరోనా మహమ్మారి భయంతో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్తగా దిగిన ఫోటోలను, ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా స్వయంగా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎందుకంటే స్వయంగా దిగింది కాని సెల్ఫీలు కావు. ఆ ఫొటో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత అందంగా ఉంది శృతి ఆ ఫోటోలో.. వెడ్డింగ్ గ్రోవ్స్ కోసం అలా స్టైలుగా దిగింది అమ్మడు. ఫుల్ కలర్స్ కాంబినేషన్ కలిగిన ఆ డ్రెస్ లో కెమెరా వైపు రెప్పవాల్చకుండా చూస్తూ పోజిచ్చింది. మెరూన్ కలర్ జాకెట్ తో పాటు గోల్డ్ బాటమ్ డ్రెస్ ధరించింది.

ఈ ఫోటోలో అమ్మడు అచ్చం పెళ్లి కూతురులా కనిపిస్తుంది. కానీ పెళ్లికూతురులా తనని తను ఎంతో అందంగా ముస్తాబు చేసుకుంది శృతి. ఈ పిక్ చూస్తూ అభిమానులు మనసులలో హాయిగా మెరిసే మెరిసే నీ కన్నుల్లో.. అంటూ గబ్బర్ సింగ్ పాడుకుంటున్నారు. లాక్ డౌన్ లో ఈ భామ పూర్తిగా ఫోటోషూట్స్ తో అభిమానులకు ఆనందం కలిగిస్తుంది. అలాగే పలు సినిమాలలో కూడా నటిస్తుంది. మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందుతున్న క్రాక్ మూవీతో పాటు బాలీవుడ్ లో 'యారా' అనే మూవీ చేస్తుంది. ఇటీవలే విడుదల చేసిన ఓ రొమాంటిక్ సాంగ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూడాలి మరి అమ్మడు మళ్లీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయినుగా చక్రం తిప్పుతుందేమో.. అంటూ సినీవర్గాలు భావిస్తున్నాయి.