Begin typing your search above and press return to search.
బడ్జెట్ విషయంలో నేచురల్ కేరింగ్ ఎక్కువైంది!
By: Tupaki Desk | 22 Sep 2020 9:30 AM GMTథియేట్రికల్ రిలీజ్ లపై సందిగ్ధత ఓవైపు .. ఓటీటీ రిలీజ్ లకే తలొంచాల్సిన పరిస్థితులు మరోవైపు నిర్మాతల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఇక హిట్టు లేని హీరో విషయంలో అసలే రాజీకి రావడం లేదన్నది తాజా సమాచారం. టాలీవుడ్ లో రోజురోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. హీరోల ఫేట్ మారిపోతోంది. మహమ్మారీ అన్నిటినీ మార్చేస్తోంది. ఇక నేచురల్ స్టార్ నాని సైతం అందుకు మినహాయింపు కానేకాదు.
నాని ఒకదాని వెంట ఒకటిగా ప్రాజెక్టులు ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్.. టక్ జగధీష్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండిటి పైనా `వి` ఎఫెక్ట్...తీవ్రంగానే పడిందట! కథ బాగోకపోతే అందులో నాని నటించినా.. ఓటీటీలో రిలీజైనా సరే జనాలు చూడరు! అనే విషయం `వి`తో ప్రూవ్ అయిపోయింది. దాంతో పాటే ఈ సినిమాతో నాని నాన్ థియేట్రికల్స్ కూడా బాగా డ్రాప్ అయినట్లు సమాచారం. ఎందుకంటే నాని ఆల్రేడీ థియేట్రికల్ బిజినెస్ విషయంలో గత నాలుగు సినిమాల నుంచి డ్రాప్ కనిపిస్తోంది. అయితే `వి` విషయంలో థియేట్రికల్ బిజినెస్ లేదు కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం కలిపి 14 కోట్లు దాటే ఛాన్స్ లేదు. అమెజాన్ వాళ్లు దిల్ రాజుకి 33 కోట్లు ఇచ్చారేమో కానీ అందులో థియేటర్ బిజినెస్ కి కాంపన్సేట్ చేసిన మొత్తం సగానికి పైగా ఉంటుంది.
ఎలా చూసినా నానిపైనా.. అతడు నటించే నెక్ట్స్ సినిమాల పైనా ఆ ప్రభావం పడింది. శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ కి బడ్జెట్ ను అదుపు చేయాల్సిందిగా నిర్మాతలు సూచించారట. ఇక టక్ జగధీష్ టీమ్ కూడా మార్పులు చేసి కొన్ని షెడ్యూల్స్ పై అదనపు పెట్టుబడి తగ్గించారట.
`శ్యామ్ సింగరాయ్` వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ కెళ్లాల్సి ఉంది. కలకత్తా నేపథ్యంలో సాగే ఆసక్తికర మూవీ ఇది. దానికోసం 80ల కలకత్తా వాతావరణంతో ఆ లుక్ ని సెట్స్ లో సృష్టించనున్నారట. నిజానికి ఒరిజినల్ లొకేషన్ లో తెరకెక్కించాల్సి ఉన్నా.. కరోనా వల్ల సెట్స్ లో చిత్రీకరించాలని భావిస్తున్నారట. ఇది బడ్జెట్ పెరగడానికి కారణమవుతోందట. కానీ ఖర్చు అదుపులో ఉండాలని నిర్మాతలు సూచించారన్న చర్చా మరోవైపు సాగుతోంది.