Begin typing your search above and press return to search.

సీతా పాప స్మైలిస్తే మాట‌లు రావ్!-న‌మ్ర‌త‌

By:  Tupaki Desk   |   9 Jan 2021 9:30 AM GMT
సీతా పాప స్మైలిస్తే మాట‌లు రావ్!-న‌మ్ర‌త‌
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్రత జంట గారాల ప‌ట్టీ సితారకు ఉన్న సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ తెలిసిందే. ఆద్య‌సితార యూట్యూబ్ చానెల్లో సితార క్యూట్ ఇంట‌ర్వ్యూలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి. ఇక సితార‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని న‌మ్ర‌త శిరోద్క‌ర్.. మ‌హేష్ జంట‌ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ చేస్తూనే ఉన్నారు. క్యూటీ సితార ఎగ్జ‌యిటింగ్ లైఫ్ స్టైల్ ని ..త‌న హావ‌భావాల్ని ఫోటోల రూపంలో షేర్ చేస్తూ వాటికి న‌మ్ర‌త ఇచ్చే క్యాప్ష‌న్లు మురిపెంగా అంతే పోయెటిక్ గా ఉంటాయి.

తాజాగా సితార క్యూట్ స్మైల్ పై న‌మ్ర‌త వ్యాఖ్య వైర‌ల్ గా మారింది. ``ఆమె(సితార‌) న‌వ్వితే మాట‌లు రావ్`` అన్న క్యాప్షన్ తో సితార స్మైలీ ఫోటోని షేర్ చేశారు న‌మ్ర‌త శిరోద్క‌ర్. దీనికి క్యూటీ అంటూ అభిమానులు సంబ‌రంగా రిప్ల‌య్ లు ఇస్తున్నారు.

సితార ఇంటి బాల్క‌నీ నుంచి ఆరుబ‌య‌ట కింది వైపు గార్డెన్ లోకి చూస్తోంది. చిన్నారి మోము చిరున‌వ్వుతో ఎంతో మ‌నోహ‌రంగా ఆహ్లాదంగా క‌నిపిస్తోంది. ఆ చిరున‌వ్వుకి ఫిదా కానిది ఎవ‌రు? అన్న‌ట్టు సితార ఇంత‌కుముందు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించారు. కానీ బాల‌న‌టిగా తెరంగేట్రం ఎప్పుడు? అన్న‌దానిపై న‌మ్ర‌త కానీ మ‌హేష్ కానీ ఇటీవ‌ల‌ ఎలాంటి అప్ డేట్ చెప్ప‌డం లేదు ఎందుక‌నో!