Begin typing your search above and press return to search.
నా కొడుకు సింగర్ కావడం నాకు ఇష్టం లేదు.. సోను నిగమ్ కామెంట్లు
By: Tupaki Desk | 16 Nov 2020 3:15 AM GMTప్రముఖ గాయకుడు సోను నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా కుమారుడు గాయకుడు కావడం నాకు ఇష్టం లేదు. అది కూడా మనదేశంలో గాయకుడు కావడం అస్సలు ఇష్టం లేదు. వాడు ఇతర రంగాల్లో ఎంతో రాణిస్తున్నాడు. నేనైతే గాయకుడు కమ్మని ప్రోత్సహించను.’ అని సోను పేర్కొన్నారు. ఆయన ఇటీవల‘ఈశ్వర్ ఖా వో సచ్చా బందా’ అనే భక్తిగీతాన్ని ఆలపించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ పాటకోసం ప్రస్తుతం ప్రమోషన్లు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోను మాట్లాడారు. భవిష్యత్తులో మీ కొడుకు నీవన్ కూడా గాయకుడయ్యే అవకాశాలున్నాయా ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. సోను నిగమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
‘ నా కుమారుడు ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు. యూఏఈలోని టాప్ గేమర్లలో తన కొడుకు కూడా ఒకడని, ఫోర్ట్‌నైట్ గేమ్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. మా కుమారుడు పుట్టుక తోనే గాయకుడని కానీ భవిష్యత్తులో ఏం కావాలి అనే దానిపై తానేమీ తన కొడుకుకు చెప్పదలుచుకోలేదన్నారు. తన కొడుకు ఏం కావాలనుకుంటున్నాడో ముందు ముందు చూద్దాం అని సోను నిగమ్ అన్నారు. అయితే తన భక్తిగీతానికి స్పందన అద్భుతంగా వస్తోందని, తాను ఏ కాన్సెప్ట్‌ను అయితే నమ్ముతానో.. అదే కాన్సెప్ట్‌తో ఈ పాటను రాసినట్టు ఆయన చెప్పారు. సోను హిందీతో పాటు కన్నడ, తమిళ, బెంగాళీ, గుజరాతీ భాషల్లోనూ ఎన్నో పాటుల పాడిన విషయం తెలిసిందే. ఆయన పాటలకు అంతర్జాతీయస్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే తన కుమారుడు భారత్ లో గాయకుడు కావడం ఇష్టం లేదని చెప్పడం సోనూ నిగమ్ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. మనదేశంలో గాయకులకు తగిన గుర్తింపు, గౌరవం ఉండదు అని ఆయన పరోక్షంగా చెప్పడం గమనార్హం. సోనూ నిగమ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.