Begin typing your search above and press return to search.

కూతురు భర్తతో అఫైర్.. టబు అవసరమా?

By:  Tupaki Desk   |   27 March 2021 5:30 AM GMT
కూతురు భర్తతో అఫైర్.. టబు అవసరమా?
X
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ లక్కీగా బాలీవుడ్ లో ఆఫర్ రావడంతో అక్కడకు వెళ్ళిపోయింది. రెండు దశాబ్దాలకు పైగా హిందీ సినిమాల్లో సత్తా చాటుతున్న ఈ అమ్మడు ఇటీవల బోల్డ్ పాత్రలకు ఒకే చెబుతోంది. మొన్నటి వరకు హీరోయిన్ పాత్రలు చేసిన టబు వయసు పెరగడం వల్ల హీరోయిన్ పాత్రలు దక్కించుకోలేక పోతుంది. దాంతో ఏ పాత్ర అయిన పర్వాలేదు అన్నట్లుగా టబు సినిమాలకు కమిట్ అవుతుంది అంటూ బాలీవుడ్ వర్గాలు వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వయసులో కూడా బోల్డ్ పాత్రలు చేయడం మరియు అందాల ఆరబోత కు ఒకే చెబుతున్న టబు ఇటీవల ఒక సినిమాలో తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న ఇషాన్ ఖట్టర్ తో బెడ్ రూమ్ సీన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అమ్మడు మరో బోల్డ్ పాత్రకు ఒకే చెప్పింది. కార్తీక్ ఆర్యన్ మరియు కీయరా అద్వానీ జంటగా బుల్ భూలయ్య 2 సినిమా రూపొందుతుంది. ఆ సినిమాలో కీయరా తల్లి పాత్రలో టబు కనిపించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ సినిమాలో టబు పాత్ర అల్లుడు కార్తీక్ ఆర్యన్ తో రొమాన్స్ చేయబోతుందట. తన వయసు కంటే చాలా తక్కువ ఉండే కార్తీకి ఆర్యన్ తో టబు మరోసారి బెడ్ రూమ్ సీన్స్ లో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాతో ఆమె విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. కానీ టబు అభిమానులు మాత్రం ఇలాంటి పాత్రలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.