Begin typing your search above and press return to search.

చీర‌లో గ్లామ‌ర్ ఎలివేష‌న్ క‌ట్ట తెగిందిగా!

By:  Tupaki Desk   |   1 Dec 2020 7:20 AM GMT
చీర‌లో గ్లామ‌ర్ ఎలివేష‌న్ క‌ట్ట తెగిందిగా!
X
పార్టీలు సెల‌బ్రేష‌న్స్ అంటే దూకుడుమీద ఉండే నటి తనీషా ముఖర్జీ ఇటీవ‌ల 42వ బ‌ర్త్ డే ని సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తన సన్నిహితులు ఆమె తల్లి ప్రముఖ నటి తనూజాతో కలిసి ఒక రిసార్ట్ ‌లో త‌నీషా చేసిన‌ సంద‌డి ప్ర‌ముఖంగా హైలైట్ అయ్యింది.

అప్ప‌ట్లో తనీషా ముఖర్జీ బీచ్ ‌వేర్ పార్టీ సంచ‌ల‌నంగా మారింది. ఈ వేడుక‌‌లో గాళ్స్ అంతా సంతోషంగా ఉత్సాహంగా బికినీల‌తో చెల‌రేగ‌డం హాట్ టాపిక్ అయ్యింది. స్నేహితులతో పార్టీకి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. తనీషా.. తనూజా ఈత దుస్తులలో హీటెక్కించారు. త‌నీషా ఇప్ప‌టికీ 40 ప్ల‌స్ లోనూ ఏజ్ లెస్ బ్యూటీగా అల‌రిస్తోంది.

తాజాగా ఇన్ స్టా వేదిక‌గా త‌నీషా రివీల్ చేసిన ఫోటో వైర‌ల్ గా దూసుకెళుతోంది. చీర‌లో గ్లామ‌ర్ ఎలివేష‌న్ క‌ట్ట తెగిందిగా! అంటూ ఆ రొమాంటిక్ శారీ లుక్ ని బోయ్స్ అదే ప‌నిగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. త‌నీషా ఇన్ స్టా ఆద్యంతం ఇంత‌కుమించి వేడెక్కించే ఫోటోల‌తో ట్రీట్ అదిరింద‌న్న‌ది యూత్ గుస‌గుస‌.

ఈ అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చూస్తే.. 2003 లో థ్రిల్లర్ మూవీ `ష్‌..`తో తన న‌ట‌వృత్తిని ప్రారంభించింది. వన్ టూ త్రీ- సర్కార్ - నీల్ నిక్కి వంటి చిత్రాలను చేసింది. హిందీ బిగ్ బాస్ ఏడవ సీజన్లో ఇంటి స‌భ్యురాలిగా అల‌రించింది. కానీ ఇటీవ‌ల ఎందుక‌నో బాలీవుడ్ లో చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్లు లేవు.