Begin typing your search above and press return to search.
షాక్ : కరోనాతో హీరోయిన్ తండ్రి మృతి
By: Tupaki Desk | 23 March 2020 9:00 AM GMTకరోనా కారణంగా సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు అంతా కూడా గజగజ వణికి పోతున్నారు. వేరే ఏదైనా జబ్బు వస్తే డబ్బుతో నయం చేసుకోవచ్చు. డబ్బున్న వారు విదేశాలకు వెళ్లి అయినా నయం చేసుకుంటారు. కాని కరోనా వైరస్ సోనిక వారు మాత్రం మందు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వృద్దులు కరోనా బారిన పడితే మృత్యు ఒడికి వెళ్తున్నారు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ కరోనా కారణంగా మృతి చెందారు.
గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న పీటర్ మైల్స్ ఆదివారం కరోనా ముందు ఓడిపోయి మృతి చెందాడు. తన తండ్రి కరోనా విషయాన్ని సోఫియా కొన్ని రోజుల ముందు చెప్పుకొచ్చింది. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు కోలుకుంటాడని ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది. కాని వృద్దుడు అయిన కారణంగా కరోనాను ఎదుర్కోవడం ఆయన వల్ల కాలేదు. సినీ పరిశ్రమకు చెందిన వారిలో మొదటి మృతి అవ్వడంతో యావత్ ప్రపంచం మొత్తం మొత్తం ఒకింత షాక్‌కు గురి అయ్యింది.
చైనా, ఇటలీ, అమెరికాలో ఈ వైరస్ అత్యంత స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుంది. ఇండియాలో వైరస్ వ్యాప్తికి ముందస్తు జాగ్రత్తలు చాలా తీసుకుంటున్న కారణంగా స్పీడ్‌గా పాకడం లేదు. ఇండియాలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. కనుక వైరస్ వ్యాప్తి మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. రెండు మూడు వారాల్లో కరోనా ఇండియాలో పూర్తిగా అదుపులోకి వస్తుందంటున్నారు. ఈ లోపు ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం అవ్వాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.