Begin typing your search above and press return to search.

వేడెక్కిస్తున్న మ‌రో శ్రీ‌రెడ్డి భోగోతం

By:  Tupaki Desk   |   20 March 2020 3:59 AM GMT
వేడెక్కిస్తున్న మ‌రో శ్రీ‌రెడ్డి భోగోతం
X
గ‌త రెండేళ్లుగా న‌టి శ్రీరెడ్డి వేధింపుల ప్ర‌హ‌స‌నం పేరుతో సాగించిన క్ర‌తువు గురించి తెలిసిందే. అవ‌కాశాలు పేరుతో వ‌లలు వేసిన మృగాళ్ల గుట్టు మ‌ట్లు బ‌య‌టికి చెబుతూ సంచలనం సృష్టించింది. పలువురు దర్శ‌కులు.. నిర్మాతలు.. యువ హీరోలు తనకి ఆఫర్లు ఇస్తామని లైంగికంగా వాడుకున్నారని తెలిపింది. కానీ అవకాశాలివ్వకుండా మోసం చేశారని బహిరంగం గానే విమర్శించింది. ప్రముఖ నిర్మాతల తనయుల ఫోటోలను సైతం సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఫిల్మ్ ఛాంబర్‌ ఎదుట అర్థనగ్నంగా పోజులిచ్చి మా అసోసియేష్ కి వ్య‌తిరేకంగా నిరసన తెలిపింది. దీంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి పేరు మారుమోగింది. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది.

తాజాగా తమిళనాట అలాంటి ఓ శ్రీరెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఎలక్కియా అనే న‌టి ఇలాంటి ఆరోపణలతోనే సంచలనాలకు తెరలేపుతుంది. టిక్‌ టాక్‌ వీడియోలతో.. సోషల్‌ మీడియా లో అతి ఎక్స్ పోజింగ్ చేసే ఈ భామ కోలీవుడ్ లో చిన్నా చిత‌కా సినిమాలు చేస్తోంది. హ‌ద్దులు చెరిపేసి ఘాటైన అందాల ఆరబోతతో హీటు పుట్టిస్తున్న ఎలక్కియా తాజాగా పలువురు దర్శకులపై ఆరోపణలు చేసింది. సదరు దర్శకులు తనకి తమ సినిమాల్లో అవకాశాలను ఇస్తామన్నారని,.. కానీ లైంగికంగా తమకు సపోర్ట్ చేయాలని ఫేవ‌ర్ కోరార‌ట. ఛాన్స్ ల కోసం తను కూడా వారికి కావాల్సింది ఇచ్చిందని.. అవసరం తీరాక మోసం చేశారని వెల్లడించింది. నమ్మించి మోసం చేసి నట్టెట‌ ముంచారంటూ ఆరోపించింది. తాను అన్ని రకాలుగా దోపిడీకి గురయ్యానని వెల్లడించింది.

ఎలక్కియా కామెంట్స్ తో ఇప్పుడు కోలీవుడ్‌ షేక్‌ అవుతుంది. నిర్మాతల కాస్టింగ్‌ కౌచ్‌ గురించి కూడా ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఎలక్కియా సరిగ్గా శ్రీరెడ్డి తరహాలోనే ఆరోపణలు చేయడం.. ఆమె ఇక్కడ చేసినట్టుగానే అక్కడ ఎలక్కియా కూడా చేయడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. తమ వ్యక్తిగత ప్రమోషన్‌ కోసమే ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారని.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మరి ఈ కోలీవుడ్‌ శ్రీరెడ్డి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.