Begin typing your search above and press return to search.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పడానికి శ్రీకారం చుట్టిన రోజు..!
By: Tupaki Desk | 6 July 2021 10:30 AM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన వెండితెర అద్భుతం ''బాహుబలి'' ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ చేసిన చిత్రంగా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రంగా 'బాహుబలి' నిలిచింది. భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఆవిష్కరించబడిన ఈ చిత్రం.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసింది.. ఎవరికి సాధ్యంకాని సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇతర సినిమాలు ఎంతటి ఘనత సాధించినా 'నాన్-బాహుబలి' అని చెప్పుకునేలా చెప్పుకునేలా చేసింది. అలాంటి విజువల్ వండర్ కు శ్రీకారం చుట్టిన రోజు ఈరోజు. ఏడేళ్ల క్రితం 6 జూలై 2013న 'బాహుబలి' సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో 'బాహుబలి' టీమ్ షూటింగ్ ప్రారంభమైన ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. 7 సంవత్సరాల క్రితం ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు. 2011 ఫిబ్రవరిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సినిమా చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. 2013 జనవరిలో 'బాహుబలి' వర్కింగ్ టైటిల్ అని వెల్లడిస్తూ.. అనుష్క శెట్టి హీరోయిన్ గా.. విలన్ గా రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో కొన్నాళ్ళకు మరో హీరోయిన్ గా తమన్నా భాటియా ను తీసుకున్నట్టుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేసిన చిత్ర బృందం.. 2013 జూలై 6న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్ లో షూటింగ్ ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన జనం మధ్య 'జై బాహుబలి' అంటూ నినదిస్తూ చిత్రీకరణ చేశారు.
'బాహుబలి' చిత్రానికి రాజమౌళి తండ్రి, ప్రముఖ దర్శకరచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో రెండు భాగాలుగా చేయాలనే ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ''బాహుబలి-ది బిగినింగ్'' ''బాహుబలి - ది కన్‌క్లూజన్'' గా సినిమాని మార్చారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని సాబు సిరిల్ రామోజీ ఫిలింసిటీలో సృష్టించారు. రాజమౌళి ఆస్థాన దర్శకుడు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఆర్క మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ - దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందించిన 'బాహుబలి' సినిమాని హిందీ మలయాళం భాషల్లో డబ్బింగ్ చేశారు. 'బాహుబలి-1' చిత్రాన్ని 2015 జూలై 10న విడుదల చేయగా.. రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. 'బాహుబలి-2' సినిమా 2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు వేల కోట్ల రూపాయలను రాబట్టింది. 'మహేంద్ర బాహుబలి' 'అమరేంద్ర బాహుబలి' పాత్రల్లో ప్రభాస్.. భల్లాల దేవుడిగా రానా మెప్పించారు. దేవసేన గా అనుష్క - అవంతిక గా తమన్నా - శివగామిగా రమ్యకృష్ణ - కట్టప్ప గా సత్యరాజ్ - బిజ్జల దేవుడిగా నాజర్ ఎవరి పాత్రల్లో వారు జీవించారని చెప్పాలి. ప్రస్తుతం ‘బాహుబలి - బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తోంది.