Begin typing your search above and press return to search.
టాలీవుడ్ హీరోలకు పాన్ ఇండియా పిచ్చేమిటో!
By: Tupaki Desk | 5 March 2020 12:30 AM GMTఇటీవల టాలీవుడ్ లో పాన్ ఇండియా అనే పదం ఎంత కామన్ అయిపోయిందో తెలిసిందే. ప్రతి హీరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం అంటూ తమ సినిమాలను ఊక దంపుడు ప్రచారం ఊదరగొడుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ కంటెంట్ లేకపోయినా పాన్ ఇండియా అంటూ తెగ ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఎవరి సినిమా వాళ్లకి గొప్ప అన్న దానిలో తప్పులేదు. సినిమాను పైకి లేపే ప్రయత్నంలో ఒక్కోసారి నోరు జారడం సహజం. కానీ పనిగట్టుకుని మరీ పాన్ ఇండియా అంటూ అక్కర్లేని ప్రచారం చేయడమే విడ్డూరంగా ఉందంటూ పరిశ్రమ వర్గాల్లో సైతం విమర్శ వినిపిస్తోంది.
ఏడాదిలో వందల కొద్ది తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో సక్సెస్ రేటు చూసుకుంటే కేవలం రెండు శాతం మాత్రమే. మరి నిజంగా పాన్ ఇండియా రేంజ్ కంటెంట్ అయితే ఎందుకు రెండు శాతమే సక్సెస్ రేటు ఉంది? అంతకు మించి పెరగదా? అంటూ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ పెద్దలు సైతం ఈ రకమైన ప్రచారంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముందు మన స్టార్లు అంతా కంటెంట్ ఉన్న సినిమాలు చేసి సక్సెస్ అయితే అప్పుడు పాన్ ఇండియా పై కాన్ సన్ ట్రేట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల టాలీవుడ్ రేంజ్ మారుతుంది.
జాతీయ స్థాయిలో తెలుగు సినిమాల గురించి చర్చ జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటాం. కానీ ముందుగా మనలో పాన్ ఇండియా రేంజ్ ఉందో లేదో? ఆత్మ పరిశీలన చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా పాన్ ఇండియా అంటూ ప్రచారం చేసుకుంటోన్న హీరోలంతా ఓసారి సీరియస్ గా దీని గురించి లోతుగా ఆలోచిస్తే బాగుంటుందన్న విమర్శ వినిపిస్తోంది. అలా కాకుండా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు అసలు మ్యాటర్ లేకుండా పాన్ ఇండియా అంటూ ప్రచారం చేసుకుంటే ఏం లాభం అంటూ చాంబర్ పెద్దలు పెదవి విరిచేస్తున్నారు.