Begin typing your search above and press return to search.

అందానికి సీక్రెట్ అదేనా

By:  Tupaki Desk   |   8 Oct 2017 7:50 AM GMT
అందానికి సీక్రెట్ అదేనా
X
వర్షం సినిమాతో తెలుగులో అందాల జల్లులు కురిపించిన భామ త్రిష. చూడగానే చిరునవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ వయ్యారి ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు దగ్గరపడుతున్నా ఇంకా తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా త్రిష తనదైన శైలిలో సినిమాలను చేస్తూ అందాలతో పోటీని ఇస్తోంది. మొదట సైడ్ హీరోయిన్ గా మొదలు పెట్టి హీరోయిన్ అయిన తర్వాత దాదాపు సౌత్ హీరోలందరితో స్క్రిన్ షేర్ చేసుకుంది.

బాలీవుడ్ లో కూడా త్రిష తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సౌత్ - నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలను చేసి బెస్ట్ అనిపించుకుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా త్రిషా అంత ఫిట్ నెస్ గా ఎలా ఉంటుందా అని సినిమా హీరోయిన్లు అనుకుంటున్నారాట. ఇక ఆమె సినిమా స్టార్స్ కి సంబంధించిన రెగ్యులర్ పార్టీలలో కూడా బాగానే పాల్గొంటోందట. అంతే కాకుండా డైట్ ను కూడా అప్పుడపుడు ఫాలో కాదట. అయితే రెగ్యులర్ గా జిమ్ వర్కౌట్స్ మాత్రం బాగానే చేస్తుందట. రీసెంట్ గా సోషల్ మీడియాలో త్రిష ఒక ఫోటోని పోస్ట్ చేసింది. ఫొటోలో త్రిష ఇంకా పదహారేళ్ల పడుచుపిల్ల లాగానే కనిపిస్తోంది. నాజూకు నడుముతో తన ఫిట్నెస్ వర్కౌట్ ఏ విధంగా ఉందొ చూపించింది.

ముఖ్యంగా త్రి ఇన్ వన్ ఏరోబిక్స్ ఎక్సర్ సైజ్ ని బాగా ఫాలో అవుతుందట ఈ వర్షం భామ. అలాగే క్యాలరీస్ పెరగడానికి ఈ వ్యాయమం చాలా ఉపయోగపడుతుందని చెబుతోంది. ప్రస్తుతం త్రిష తెలుగు - తమిళ్ మరియు మలయాళం చిత్రాలతో చాలా బిజీగా వుంది.