Begin typing your search above and press return to search.

ఏడు భాషల్లో విడుదల కాబోతున్న సౌత్‌ మూవీ

By:  Tupaki Desk   |   18 Sep 2020 10:10 AM GMT
ఏడు భాషల్లో విడుదల కాబోతున్న సౌత్‌ మూవీ
X
కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్రకు సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలుగులో ఉపేంద్ర హీరోగా నటించిన సినిమాలు సూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగులో ఉపేంద్రకు మంచి డిమాండ్‌ ఉన్నట్లుగానే ఇతర భాషల్లో కూడా ఆయన సినిమాలకు మంచి పేరు ఉంది. అందుకే ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'కబ్జా' సినిమాను ఏకంగా ఏడు భాషల్లో విడుదల చేయబోతున్నారట.

ఈమద్య కాలంలో పాన్‌ ఇండియా సినిమాలు అంటే హిందీతో పాటు తెలుగు.. తమిళం.. కన్నడం మరియు మలయాళంలో విడుదల చేస్తున్నారు. కాని కబ్జా సినిమాను మాత్రం ఒడియా మరియు మరాఠీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ భాషల్లో ఉపేంద్రకు ఉన్న గుర్తింపు కారణంగా సినిమాపై ఆసక్తి ఉందట.

ఈమద్యకాలంలో ఇన్ని భాషల్లో విడుదల అవ్వబోతున్న సౌత్‌ సినిమా ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్‌ చంద్రు దర్శకత్వం వహించాడు. సినిమాలో ఉపేంద్ర అత్యంత విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌ అవ్వడం వల్లే ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉపేంద్ర పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ మంచి రెస్పాన్స్‌ వచ్చింది.