Begin typing your search above and press return to search.

మెగా హీరో హై అలెర్ట్ .. సేఫ్ ఇన్ హోమ్ ఓన్లీ

By:  Tupaki Desk   |   12 May 2021 2:30 PM GMT
మెగా హీరో హై అలెర్ట్ .. సేఫ్ ఇన్ హోమ్ ఓన్లీ
X
అందరూ ఇంట్లోనే ఉండాలని వరుణ్ తేజ్ కొణిదెల ఆల్మోస్ట్ హెచ్చ‌రించారు. సెకండ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఇండ్ల‌లోంచి రావ‌డం స‌రికాద‌ని నివేదించాడు. తాను ఇంట్లోనే ఉన్న‌ప్ప‌టి ఓ ఫోటోని కూడా షేర్ చేశాడు. ఈ గంట మ‌నం ఇంట్లో ఉండడం చాలా అవ‌స‌రం .. అని అన్నాడు.

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 రెండవ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణలో లాక్ డౌన్ ని ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ఈ నేపథ్యంలో వరుణ్ పోస్ట్ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇంత‌కుముందు వ‌రుణ్ తండ్రి నిర్మాత నాగ‌బాబుకు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఆయ‌న చికిత్స తో కోలుకున్న‌రు. మెగా కాంపౌండ్ లోనే ఆరుగురికి కోవిడ్ సోక‌డంతో ఇప్పుడు అంతా అలెర్ట‌య్యారు. అంతా షూటింగుల్ని బంద్ చేసి ఇంట్లోనే కుటుంబంతో గ‌డుపుతున్నారు.

వరుణ్ తేజ్ త‌దుప‌రి చిత్రంలో బాక్సర్ పాత్ర‌లో నటించనున్నాడు. తాత్కాలికంగా # వీటీ 10 అని ఈ మూవీకి టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి డెబ్యూ కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సీక్వెల్ ఎఫ్ 3లోనూ వరుణ్ న‌టిస్తున్నారు.