Begin typing your search above and press return to search.

విక్టరీ వెంకటేష్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడా...?

By:  Tupaki Desk   |   9 May 2020 6:50 AM GMT
విక్టరీ వెంకటేష్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడా...?
X
కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలను వెబ్ సిరీసులను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీస్ అందరూ ఒకే దగ్గర సరదాగా గడుపుతూ ఈ వెబ్ సిరీస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి.. ఒకవేళ కరోనా కంట్రోలై లాక్ డౌన్ ఎత్తేసినా కూడా జనాలు సినిమా థియేటర్స్‌ ఒకప్పటిలా వచ్చి ఎగబడి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. దీంతో రాబోయే రోజుల్లో కూడా వీటి హవా ఇలానే కొనసాగే అవకాశముంది. భవిష్యత్ లో ఓటీటీలదే రాజ్యం కాబోతోందని భావించిన దర్శక నిర్మాతలు వెబ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా పలు ఓటీటీలు మరింత క్రేజ్ పెంచుకునేందుకు స్టార్ యాక్టర్స్ ని వెబ్ సిరీస్‌ లలో నటింపజేయాలని పప్లాన్స్ వేస్తున్నారు.

ఇప్పటికే పలువురు వెబ్ సిరీసులలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం వెబ్ కంటెంట్ తో నటించడానికి ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్, రాజ్ కుమార్ రావు, మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, కియారా అద్వానీ, రాధికా ఆప్టే, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్ లాంటి వారు వెబ్ సిరీసులలో నటిస్తున్నారు. మన టాలీవుడ్ లో కూడా శ్రీకాంత్, సందీప్ కిషన్, నవదీప్, మంచు లక్ష్మీ, హెబ్బా పటేల్ లాంటి వారు ఇప్పటికే వెబ్ సిరీస్ లలో దర్శనమిచ్చారు. కాకపోతే ప్రస్తుతానికి వెబ్ సిరీసెస్ అన్నీ స్టార్స్ లేకుండా చిన్నవాళ్లతోనే తీస్తున్నారు. ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ సమంత ప్రియమణి కూడా ఆ వైపుగా అడుగులు వేశారు. తెలుగు వెబ్ సిరీస్ లలో మాత్రం స్టార్ యాక్టర్స్ నటించడం లేదు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో వెబ్ సిరీస్ తీయాలని ప్లాన్ చేస్తున్నారట. సురేష్ బాబు ఇప్పటికే ఆ విధంగా ఆలోచనలు స్టార్ట్ చేశారట. ఫ్యామిలీస్ కూడా వెబ్ సిరీస్ చూస్తుండటంతో తెలుగు వెబ్ సిరీస్ సంచలనం అయ్యేలా వెంకటేష్ తో ఒక సిరీస్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. దీనిపై డైరెక్టర్ తేజతో డిస్కషన్ కూడా జరిగిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం తెలుగు సినిమా ఓటిటీ రంగంలో హవా చూపించడం ఖాయమని చెప్పవచ్చు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.