Begin typing your search above and press return to search.
టాలీవుడ్: అందరి టార్గెట్ నెంబర్ వన్ పొజిషన్ కే!
By: Tupaki Desk | 7 May 2020 2:30 PM GMTటాలీవుడ్ లో నెంబర్ వన్ ఎవరు అనేది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక్కొక్క ప్రేక్షకుడు ఒక్కో సమాధానం చెప్తాడు. ఫ్యాన్స్ లో ఎక్కువమంది తమ ఫేవరేట్ హీరో పేరు చెప్పి ఆయనే నంబర్ అని వీలైనంత గుడ్డిగా.. లాజిక్ అనేదే లేకుండా వాదిస్తారు. పైకి ఎన్ని చెప్పినా వారి అసలు లాజిక్ తమ ఫేవరెట్ స్టార్ నెంబర్ వన్ అని బ్లైండ్ గా మైండ్ లో ఫిక్స్ కావడమే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ లీగ్ హీరోలను ఒక్కసారి పరిశీలిస్తే.. అందరూ స్టార్ హీరోలు నెంబర్ వన్ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే సంగతి మనకు అర్థం అవుతుంది.
పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ మాస్ ఇమేజ్ సంగతి అందరికీ తెలిసిందే. అయితే రెండేళ్ళు పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారు కాబట్టి తన రీ-ఎంట్రీ సినిమాతో ఒక్కసారి గా తన సత్తా చాటాలని భావిస్తున్నారట. 'వకీల్ సాబ్' తోనే నెంబర్ వన్ అని నిరూపించాలని ఇప్పటికే ఫ్యాన్స్ కు ఎలెర్ట్ వెళ్ళిపోయిందట.
మహేష్ బాబు: మహేష్ బాబుకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే ఇంకా నెంబర్ వన్ మాత్రం కాలేదు. మహేష్ మార్కెట్ ఇంకా పెరగలిసింది ఉంది
అల్లు అర్జున్: నెంబర్ వన్ అనుకుంటున్న మహష్ బాబుతోనే బాక్స్ ఆఫీసు పోటీలో నెగ్గాం కాబట్టి ఇప్పుడు పవన్ మార్కెట్ ను కూడా దాటాలని భావిస్తున్నారట. సౌత్ ఇండియా మొత్తంలో టాప్ స్టార్ గా నిలవాలని ఆలోచనతో ప్రణాళికలు వేసుకుంటున్నారట.
ఎన్టీఆర్: నెంబర్ వన్ పొజిషన్ కోసం గత 17 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారని.. అయితే సరైన టైమ్ లో హిట్లు పడకపోవడం ఆ టార్గెట్ రీచ్ కాలేకపోయారని అంటున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ ప్రయత్నం కొనసాగుతూనే ఉందట.
రామ్ చరణ్: ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నప్పటికీ ఎందుకో మొదటి నుంచి చరణ్ రేసులో ముందువరుసలో లేరని అంటున్నారు.
ప్రభాస్: అన్ని విషయాల్లో ప్రభాస్ నెంబర్ వన్ అయినప్పటికీ ఆ విషయాన్ని తెలుసుకోవడం లేదట. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల మార్కెట్ కు రెండింతలు ఉన్నప్పటికీ లో-ప్రొఫైల్ లో ఉంటున్నాడని అంటున్నారు.
చిరంజీవి: గతంలో చిరంజీవి నంబర్ వన్ అనేది ఎవరైనా ఒప్పుకుంటారు. అయితే ఇప్పుడు కాదు. అయితే మెగాస్టార్ ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్ తో.. పోటీ పడుతూ ఈతరం హీరోలకు టెన్షన్ తెప్పిస్తున్నారట.