Begin typing your search above and press return to search.

అజ‌ర్ బైజాన్ అంటే ఎందుకంత ఆస‌క్తి?

By:  Tupaki Desk   |   4 Nov 2019 2:33 PM GMT
అజ‌ర్ బైజాన్ అంటే ఎందుకంత ఆస‌క్తి?
X
అజ‌ర్ బైజాన్ .. ఇటీవ‌ల ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఇది. టాలీవుడ్ మేక‌ర్స్ ఎక్కువగా ఈ లొకేష‌న్ కి వెళ్లి షూటింగులు చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అప్ప‌ట్లో రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం షూటింగ్ చేశారు. ఆ షూటింగ్ స‌మ‌యంలోనే మెగాస్టార్ చిరంజీవి అజ‌ర్ బైజాన్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. అప్ప‌టివ‌ర‌కూ ప‌లు బాలీవుడ్ చిత్రాల్ని మాత్ర‌మే ఈ లొకేష‌న్ లో తెర‌కెక్కించారు. ఆ త‌ర్వాత మ‌న మేక‌ర్స్ దృష్టి అటు మ‌ర‌లింది.

ప‌లు భారీ బ‌డ్జెట్ చిత్రాల్ని అజ‌ర్ బైజాన్ లో తెర‌కెక్కించ‌డం చూస్తున్న‌దే. అయితే కేవ‌లం పెద్ద సినిమాలు మాత్ర‌మే కాదు.. ప‌రిమిత బ‌డ్జెట్ ఉండే చిన్న సినిమాల్ని ఇప్పుడు అక్క‌డ షూటింగ్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తన తాజా చిత్రం కోసం అక్కడికి వెళ్లడానికి హీరో కార్తికేయ సిద్ధమవుతున్నాడు. కార్తికేయ హీరోగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో 90ML చిత్రానికి సంబంధించి రెండు పాటల చిత్రీకరణకు అజర్ బైజాన్ రాజధాని బాకు వెళుతున్నట్టుగా చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి ప్ర‌క‌టించారు. ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాల‌కు ఆ లొకేష‌న్ అనుకూల‌మేనా? అంటే అవున‌నే తెలుస్తోంది.

మ‌న‌వాళ్లు అంతా అక్క‌డికి వెళ్లేందుకు కార‌ణ‌మేమిటి? అంటే లొకేష‌న్ల అనుమ‌తులు సులువు. పైగా విదేశీ ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హిస్తూ.. ప‌న్ను మిన‌హాయింపును ఇస్తోంది ఆ దేశం. అలాగే కార్మికులు డ్యాన్స‌ర్ల‌కు అయ్యే ఖ‌ర్చు కూడా త‌క్కువ‌. ఇది చిన్న బ‌డ్జెట్ చిత్రాల‌కు లాభించే అంశ‌మేన‌ట‌. అంద‌మైన లొకేష‌న్ కుదురుతుంది. రిచ్ గా తీసామ‌ని చెప్పొచ్చు. ప‌న్ను మిన‌హాయింపు ద‌క్కుతోంది. అందుకే ఆ లొకేష‌న్ ని ప్రిఫ‌ర్ చేస్తున్నార‌ని ఫిలిం మీడియాలో ముచ్చ‌టించుకుంటున్నారు. ఇంత‌కుముందు లండ‌న్ లాంటి చోట్ల షూటింగ్ చేస్తే ప‌న్ను మిన‌హాయింపు వ‌చ్చేది. యూరప్ లోని కొన్ని లొకేష‌న్ల‌కు ఈ త‌ర‌హా ఫెసిలిటీ ఉండ‌డంతో అటువైపు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. అయితే డెస్టినేష‌న్ కి వెళ్లాలంటే ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. పెద్ద సినిమాల‌కే అక్క‌డ ఛాన్స్ ఉంటోంది.

ఇక‌ అజ‌ర్ బైజాన్ అందాల లొకేష‌న్ల‌కు పెట్టింది పేరు. రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్ దక్షిణ కాకసస్ ప్రాంతంలోని అతి పెద్ద దేశం. అత్యధిక జనాభా నివ‌సించే దేశం కూడా. ఇది పాక్షికంగా తూర్పు ఐరోపా .. పాక్షికంగా పశ్చిమ ఆసియా లోనూ ఉంది. దీని సరిహద్దులలో తూర్పున కాస్పియన్ సముద్రం.. దక్షిణాన ఇరాన్.. పశ్చిమాన ఆర్మేనియా.. వాయువ్యాన జార్జియా.. ఉత్తరాన రష్యా దేశం ఉన్నాయి. ఈ దేశానికి చెందిన అనేక దీవులు కాస్పియన్ సముద్రంలో ఉన్నాయి. అజర్‌బైజాన్ లోని నఖ్చివన్ అటానిమస్ రిపబ్లిక్ ఎక్స్‌క్లేవ్ ఉత్తర .. తూర్పు దిశలలో ఆర్మేనియా.. దక్షిణం పశ్చిమంలో ఇరాన్ ఉంటాయి. వాయవ్యంలో అతిస్వల్పంగా టర్కీ సరిహద్దు ఉంటుంది.