Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: స్టన్నింగ్ లుక్ లో కింగ్

By:  Tupaki Desk   |   28 Dec 2019 5:41 AM GMT
ఫస్ట్ లుక్: స్టన్నింగ్ లుక్ లో కింగ్
X
అక్కినేని నాగార్జున 'మన్మథుడు 2' తర్వాత సాలమన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా పెద్దగా హడావుడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లోనే సినిమా టైటిల్ కూడా 'వైల్డ్ డాగ్' అని వెల్లడించారు.

ఈ సినిమాలో నాగార్జున ఎసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారని వెల్లడించారు. ఈ పోస్టర్ లో ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్.. అందులో నాగార్జున ఒక పోలీస్ ఆపరేషన్లో ఉన్నట్టుగా చూపించారు. విజయ్ వర్మకు నిక్ నేమ్ 'వైల్డ్ డాగ్' అని కూడా వెల్లడించారు. న్యూస్ ఐటెం హెడింగ్ 'నగరంలో ఎన్ కౌంటర్: ఆరుగురు మృతి. పోలీసా లేక వైల్డ్ డాగా?' నేరస్తులను తీవ్రవాదులను నిర్దాక్షిణ్యంగా తన ఆపరేషన్లలో హతమార్చే పోలీస్ ఆఫీసర్ గా ఒక ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా నాగార్జునను చూపించబోతున్నారు. ఈ గెటప్ లో నాగార్జున పర్ఫెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నారు.

ఈ పోస్టర్ చూస్తుంటే నాగార్జున మరో విభిన్న ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది. మరి ఈ సినిమాతో నాగ్ ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో వేచి చూడాలి. షానీల్ దేవ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.