Begin typing your search above and press return to search.

పుష్పలో హీరో సోదరి పాత్ర కోసం వరల్డ్‌ ఫేమస్ సువర్ణ

By:  Tupaki Desk   |   26 April 2021 9:30 AM GMT
పుష్పలో హీరో సోదరి పాత్ర కోసం వరల్డ్‌ ఫేమస్ సువర్ణ
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఏమీ లేకుండా పుష్ప షూటింగ్ సాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో కీలక పాత్రలో మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమా గురించి మరో వార్త ఒకటి అనధికారికంగా సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ కీలక పాత్రలో కనిపించబోతుందట.

వరల్డ్‌ ఫేమస్ లవర్‌ సినిమా లో విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన ఐశ్వర్య రాజేష్‌ ను పుష్ప సినిమా లో కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. సినిమా లో హీరో సోదరి పాత్ర ఉంటుందట. కీలకమైన ఆ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్‌ ను సంప్రదించగా చివరకు ఐశ్వర్య రాజేష్‌ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె పాత్ర ఒక పోలీస్ ఆఫీసర్‌ తో లవ్‌ ట్రాక్ ను కూడా కలిగి ఉంటుందని సమాచారం. సినిమా లో ఐశ్వర్య రాజేష్‌ పోషిస్తున్న పాత్ర చనిపోతుందని పుష్ప రాజ్‌ అందుకు ప్రతీకారం తీర్చుకుంటాడని కూడా సమాచారం.

ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ఐశ్వర్య రాజేష్‌ ప్రస్తుతం తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది. తెలుగు అమ్మాయి అయినా తమిళంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఐశ్వర్య రాజేష్‌ తెలుగులో కూడా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే కమర్షియల్‌ హీరోయిన్‌ గా కాకుండా ఇలా ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తోంది. పుష్ప లో ఐశ్వర్య రాజేష్‌ పాత్ర ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.