Begin typing your search above and press return to search.
గాసిప్ చూసి ఉలిక్కిపడి బయటకి వచ్చిన ఏజెంట్...!
By: Tupaki Desk | 29 April 2020 5:30 AMనందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఇక ఈ చిత్రంలో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య పాత్రకు అసిస్టెంట్ గా చాలా కీలకమైన రోల్ ఒకటి ఉండగా.. దాని కొరకు ఆయనని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా దాని గురించి నవీన్ పోలిశెట్టి క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ .. 'బోయపాటి సినిమాకి సంబంధించి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ సినిమాలో నేను చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అదంతా కేవలం పుకారు మాత్రమే' అంటూ చెప్పుకొచ్చాడు. నవీన్ తాజా ప్రకటనతో ఆ వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది.
ఇక నవీన్ పోలిశెట్టి విషయానికొస్తే.. ఆయన పేరు వినగానే అందరికీ 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' గుర్తుకు వస్తుంది. కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. యంగ్ డిటెక్టివ్ రోల్ లో నవీన్ అదరగొట్టాడు. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకునే నవీన్.. తాజాగా 'జాతిరత్నాలు' అనే సినిమా చేశాడు. మహానటి మేకర్స్ అశ్వనీదత్ కుమార్తె స్వప్న ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. లాక్ డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయిందట. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. పూర్తి వినోదభరితమైన ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాతో పాటు 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' నిర్మాతలు కూడా నవీన్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏజెంట్ కు పార్ట్–2 చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ పొలిశెట్టి సక్సెస్ ట్రాక్ కొనసాగించాలని కోరుకుంటున్నారు.