Begin typing your search above and press return to search.

బాలయ్య బెల్లంకొండ కాంబోతో ఆ పుకార్లకు చెక్‌ పెట్టనున్నారా?

By:  Tupaki Desk   |   28 July 2020 6:00 AM
బాలయ్య బెల్లంకొండ కాంబోతో ఆ పుకార్లకు చెక్‌ పెట్టనున్నారా?
X
చాలా కాలం నుండి నందమూరి బాలకృష్ణకు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కు విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో గతంలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని కూడా దక్కించుకుంది. కాని మద్యలో ఏం జరిగిందో కాని విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వివాదం నేపథ్యంలోనే వర్మ ఒక సినిమాను తీస్తాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ పుకార్లకు చెక్‌ పెట్టాలని బాలయ్య భావిస్తున్నాడా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.

బెల్లంకొండ సురేష్‌ తనయుడు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. అతడితో కలిసి తన తాజా చిత్రంలో బాలయ్య నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలక ఎపిసోడ్స్‌ లో శ్రీనివాస్‌ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. సినిమాలోని ఆ కీలకమైన పవర్‌ ఫుల్‌ పాత్రను బెల్లంకొండ హీరో చేస్తే బాగుంటుందని బోయపాటి ఆలోచించడం అందుకు బాలయ్య కూడా ఓకే చెప్పడం అన్ని జరిగి పోయాయట.

ఈ కాంబోతో సినిమాకు క్రేజ్‌ పెరగడంతో పాటు వివాదంకు చెక్‌ పెట్టినట్లుగా అవుతుందని భావిస్తున్నారట. బాలయ్యకు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సూపర్‌ హిట్‌ అవసరం. ఈ సినిమాతో బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్‌ కొడతాడని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది. పరిస్థితులు కుదుటపడ్డ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. కాశి వారణాసి బ్యాక్‌ డ్రాప్‌ లో ఎక్కువ శాతం సీన్స్‌ ఉంటాయని సమాచారం.